కన్నప్ప మూవీలో కాజల్ పాత్ర ఏంటో తెలుసా?

07 January 2025

samatha

చాలా మంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా  తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పటికే విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ  టీజర్ విడుదలై చాలా మంది అభిమానుల మనసు దోచుకున్న విషయం తెలిసిందే.

రీసెంట్‌గా ఈ మూవీ నుంచి అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

 చాలా రోజుల నుంచి చందమామ అభిమానులందరూ కన్నప్పలో కాజల్ ఏ పాత్రలో కనిపించబోతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు దానికి తెరపడింది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ పార్వతి దేవిలా కనిపించింది. దీంతో కన్నప్ప మూవీలో ఈ బ్యూటీ పార్వతీ దేవిలా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా మొత్తం నాలు భాషల్లో అభిమానుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దీంతో మూవీ విడుదల కోసం మంచు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి శరత్  కుమార్, మధుబాల, దేవరాజ్ వంటి నటుల పోస్టర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసింది.