Actress: కురుల మాటున దాగిన ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈమె స్విమ్మర్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా..

పై ఫొటోలో కురుల మాటున దాగి ఉన్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. యంగ్‌ హీరోలతో కలిసి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకుంటుండమే దీనికి కారణం. టాలీవుడ్‌ లక్కీ హీరోయిన్‌గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ స్విమ్మింగ్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే స్టేట్‌ లెవెల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రాణించింది. అయితే మోడలింగ్‌పై ఆసక్తితో అందాల పోటీల్లో పాల్గొంది. ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో సత్తా చాటింది. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన

Actress: కురుల మాటున దాగిన ఈ క్రేజీ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈమె స్విమ్మర్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా..
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Aug 13, 2023 | 7:00 AM

పై ఫొటోలో కురుల మాటున దాగి ఉన్న అందాల తార ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. యంగ్‌ హీరోలతో కలిసి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకుంటుండమే దీనికి కారణం. టాలీవుడ్‌ లక్కీ హీరోయిన్‌గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ స్విమ్మింగ్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే స్టేట్‌ లెవెల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రాణించింది. అయితే మోడలింగ్‌పై ఆసక్తితో అందాల పోటీల్లో పాల్గొంది. ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో సత్తా చాటింది. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు మొత్తం 4 సినిమాల్లో నటించింది. అందులో మూడు హిట్ సినిమాలు ఉన్నాయి. అందుకే ఈ అమ్మడికి తెలుగులో ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. అలాగే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ మూవీలోనూ అవకాశం దక్కించుకుంది. మరి జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం కూడా మేమే చెబుతాం లెండి. ఈ అందాల తార మరెవరో కాదు.. మీనాక్షి చౌదరి.

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీనాక్షి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. అందులో తన అందమైన ముఖాన్ని కురులతో కప్పేసింది. ప్రస్తుతం తన ఫొటోస్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సుశాంత్‌ ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. రవితేజతో కలిసి ఖిలాడి సినిమాలో ఆడిపాడింది. ఆతర్వాత అడివిశేష్ హిట్‌ 2 సినిమాతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న మీనాక్షి ప్రస్తుతం మహేశ్‌ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. అలాగే వరుణ్‌ తేజ్‌ నటిస్తోన్న మట్కా మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. విశ్వక్‌ సేన్‌ నటిస్తోన్న తాజా సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే కథానాయిక.

ఇవి కూడా చదవండి

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.