Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఎనర్జీ సీక్రెట్‌ అంతా హిమాలయాల్లోనే ఉందా? వాటిని తినడం వల్లే ..

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తరచుగా హిమాలయాలను సందర్శిస్తుంటారు. సినిమా విడుదలైతే తప్పకుండా ఇక్కడకు వెళ్తుంటారు. మనశ్శాంతి కోసం హిమాలయాలను సందర్శిస్తాడని చాలా మందికి తెలుసు. అయితే రజనీ తొలిసారి హిమాలయాలకు ఎప్పుడు వెళ్లారు? అసలు ఇక్కడితో ఆయన అనుబంధం ఎలా మొదలైంది? తదితర విషయాలపై హృషీకేశ్‌లోని కన్నడిగుల్లో ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా  కోవిడ్ కారణంగా గత నాలుగేళ్లుగా అక్కడికి వెళ్లలేకపోయారు.

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఎనర్జీ సీక్రెట్‌ అంతా హిమాలయాల్లోనే ఉందా? వాటిని తినడం వల్లే ..
Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Aug 13, 2023 | 6:45 AM

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ తరచుగా హిమాలయాలను సందర్శిస్తుంటారు. సినిమా విడుదలైతే తప్పకుండా ఇక్కడకు వెళ్తుంటారు. మనశ్శాంతి కోసం హిమాలయాలను సందర్శిస్తాడని చాలా మందికి తెలుసు. అయితే రజనీ తొలిసారి హిమాలయాలకు ఎప్పుడు వెళ్లారు? అసలు ఇక్కడితో ఆయన అనుబంధం ఎలా మొదలైంది? తదితర విషయాలపై హృషీకేశ్‌లోని కన్నడిగుల్లో ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా  కోవిడ్ కారణంగా గత నాలుగేళ్లుగా అక్కడికి వెళ్లలేకపోయారు. ‘జైలర్’ సినిమా విడుదల సందర్భంగా హృషీకేశ్‌ను సందర్శించారు. స్వామి దయానంద సరస్వతి స్వామీజీ రజనీకాంత్ ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. 1992-93 మధ్య కాలంలో రజనీకాంత్ తొలిసారిగా స్వామి దయానంద సరస్వతి స్వామీజీని చెన్నైలో కలిశారు. అప్పట్లో రజనీకాంత్‌పై స్వామీజీ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒకసారి తాను కూడా హిమాలయాకు రావాలని ఉందన్న ఆసక్తిని స్వామీజీతో చెప్పారట. అయితే అక్కడికి రావడం అనుకున్నంత సులువు కాదు. అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ముందుగానే సూచించారట. ఆ హృషీకేశ్‌లోని మా ఆశ్రమంలో ఉండాలని తర్వాత దయానంద సరస్వతి స్వామీజీ రజనీకి చెప్పారట. ఆ తర్వాత రజనీకాంత్ చాలా సందర్భాల్లో హృషీకేశ్‌ను సందర్శించారు. అలా హృషీకేశ్‌తో రజనీకాంత్‌కు బంధం ఏర్పడింది. ఈ విషయాన్ని రజనీ ప్రస్తావించారని అక్కడి కన్నడిగుల్లో ఒకరు వివరించారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున బౌన్సర్లు ఉంటారు. పోలీసులు ఉంటారు. అయితే హృషీకేశ్‌లో రజనీ ఒక్కరే వచ్చారు. బౌన్సర్లు లేరు. అక్కడ చూసిన వారికి ఆయన రజనీనా అనే ప్రశ్న తలెత్తిందట. రజనీ చాలా సింపుల్‌గా ఉండేవారు’ అని అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారట. బహుశా సాదాసీదా జీవితాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా రజనీకాంత్ కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉండనున్నారు. ఆపై మరొక ప్రాంతానికి వెళ్లిపోతారట. హిమాలయాల్లో రజనీకాంత్‌కు చాలా మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వారందరిని కలిసిన తర్వాతే ఇంటికి తిరిగివెళతారట. ఇక హిమాలయాల్లో సన్యాసులను కలిసి పూజలు చేస్తారని, వారు ఇచ్చే వేర్లు, తాయత్తుల కారణంగానే ఆయన ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటారని రజనీ స్నేహితుడు రాజ్ బహదూర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.