AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నటుడిని గుర్తుపట్టారా? తెలుగు ఇండస్ట్రీ దిగ్గజాల్లో ఒకరు.. హంగులు, ఆర్భాటాలకు దూరం.. సపరేట్ ఫ్యాన్ బేస్

ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా? ఈ జనరేషన్‌ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనో లెజెండరీ యాక్టర్‌. సాధారణంగా ఇండస్ట్రీలోని హీరోల్లో చాలామంది కాస్త పేరు రాగానే హంగులు, ఆర్భాటాలకు పోతారు. కానీ ఈ నటుడి రూటే వేరు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఇప్పటికీ పాటిస్తున్నారు.

ఈ నటుడిని గుర్తుపట్టారా? తెలుగు ఇండస్ట్రీ దిగ్గజాల్లో ఒకరు.. హంగులు, ఆర్భాటాలకు దూరం.. సపరేట్ ఫ్యాన్ బేస్
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 03, 2023 | 5:32 PM

Share

ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా? ఈ జనరేషన్‌ వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనో లెజెండరీ యాక్టర్‌. సాధారణంగా ఇండస్ట్రీలోని హీరోల్లో చాలామంది కాస్త పేరు రాగానే హంగులు, ఆర్భాటాలకు పోతారు. కానీ ఈ నటుడి రూటే వేరు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆన్‌ స్క్రీన్‌ అయినా, ఆఫ్‌ స్క్రీన్‌ అయినా కమర్షియల్‌ హంగులు, ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటారు. సింప్లిసిటీకి కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే ఆయన సమాజంలో జరిగిన వాస్తవ సంఘటనలనే కథలుగా తీసుకుంటారు. ఆ సినిమాల ద్వారానే ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కమర్షియల్‌ హంగులు లేని సినిమాలకు నిర్మాతలు కాబట్టి తనే ఒక ప్రొడక్షన్‌ బ్యానర్‌ను స్థాపించి సినిమాలు తెరకెక్కించారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గా, నిర్మాతగా, రచయితగా, పాటల రచయితగా.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నారు. అన్నిటికీ మించి పీపుల్స్‌ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. యస్‌. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు నారాయణ మూర్తి. సినిమా కెరీర్‌ ప్రారంభంలో ‘సంగీత’ అనే సినిమాలో ఆయన నటించారు. అందులో అమాయక కుర్రాడిగా కనిపించి ఆకట్టుకున్నారు.

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సంగీత సినిమాలో నిర్మలమ్మ కుమారుడిగా నటించారు నారాయణమూర్తి. మురళీమోహన్, సిల్క్ స్మిత ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీలో నారాయణ మూర్తి పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆకలికి ఏ మాత్రం తట్టుకోలేడు. ఒకసారి హోటల్‌కి వెళ్లి ఫుల్లుగా తినేస్తాడు. దెబ్బకు పాత్రలన్నీ ఖాళీగా దర్శనమిస్తాయి. దీంతో బెదిరిపోయిన హోటల్‌ యజమాని వెంటనే మూర్తి డబ్బులు వెనక్కు ఇచ్చేసి బయటకు పంపిస్తాడు. అలాగే మరోసారి ఏదో పిలవని పేరంటానికి ఇలాగే ఫుల్లుగా లాగించేస్తాడు. దీంతో అక్కడున్న అతిథులందరూ షాక్‌ అవుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అమాయకమైన కుర్రాడి పాత్రలో నారాయణ మూర్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి
Narayana Murthy

Narayana Murthy

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..