AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భోళా శంకర్‌ షూటింగ్‌ పూర్తి.. డైరెక్టర్‌ ఎమోషనల్‌

'వాల్తేరు వీరయ్య' తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఏకంగా రూ.200 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇప్పుడీ రికార్డులను కొల్లగొట్టేందుకు 'భోళా శంకర్‌' గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించంది.

Bhola Shankar: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. భోళా శంకర్‌ షూటింగ్‌ పూర్తి.. డైరెక్టర్‌ ఎమోషనల్‌
Bhola Shankar Movie
Basha Shek
|

Updated on: Jul 03, 2023 | 6:53 PM

Share

‘వాల్తేరు వీరయ్య’ తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమాను ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఏకంగా రూ.200 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇప్పుడీ రికార్డులను కొల్లగొట్టేందుకు ‘భోళా శంకర్‌’ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించంది. మహానటి కీర్తి సురేష్‌ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది. ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌, క్రియేటీవ్‌ కమర్శియల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేసింది చిత్రబృందం. ఇటీవల టీజర్‌ కూడా రిలీజ్‌ చేసింది. అంతకుముందు పోస్టర్‌లు, లిరికల్‌ సాంగ్స్‌ను కూడా విడుదల చేసింది. ఇవి మెగాఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. వీటిని చూస్తుండే వింటేజ్‌ మెగాస్టార్‌ను చూసినట్లు ఉందని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. తాజాగా భోళాశంకర్‌ గురించి మరో కీలక అప్డేట్‌ ఇచ్చారు డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌. మెగాస్టార్‌ చిరంజీవి సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ ట్వీట్‌ చేశారు మెహర్‌ రమేశ్‌.

‘భోళాశంకర్‌’ షూటింగ్‌ స్పాట్‌లో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన మెహర్‌ రమేశ్‌ .. ‘భోళాశంకర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్‌ కోసం గడిచిన కొద్ది రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడిన నటీనటులు, సాంకేతిక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌, పాటల రిలీజ్‌ త్వరలోనే మొదలవుతుంది’ అని రాసుకొచ్చారు. ఇక భోళాశంకర్‌ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా