సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ ప్రొడ్యూసర్ కేసీఎన్ మోహన్ (61) ఆదివారం కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన..
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ ప్రొడ్యూసర్ కేసీఎన్ మోహన్ (61) ఆదివారం కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కేసీ మోహన్ తన కెరీర్‌లో జయసింహా, భలే చతుర, జూలీ, హూమాలె, అలిమయ్య, ఆచార్య, పోలీస్ పవర్, సినిమా వంటి ఎన్నో హిట్ మువీలను నిర్మించారు.
మోహన్ మృతిపట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కేసీఎన్ మోహన్‌కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నెళ్ల క్రితమే ఆయన భార్య మృతి చెందారు. గతేడాది కేసీఎన్ మోహన్ సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ కూడా మృతి చెందారు. వరుస విషాదాల నుంచి కోలుకోకముండే కేసీఎన్ మోహన్ కూడా మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.