ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా సినిమా.. ఫస్ట్ లుక్ ఇదే!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి తెలియనివారుండరు. టాలీవుడ్‌తోపాటు హిందీ, కన్నడ, తమిళంలో 150కి పైగా సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. కొన్ని బుల్లితెర డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు కూడా ఆయన జడ్జిగా వ్యవహరించారు. తాజాగా విజయ్ చౌదరి దర్శకత్వంలో..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి తెలియనివారుండరు. టాలీవుడ్‌తోపాటు హిందీ, కన్నడ, తమిళంలో 150కి పైగా సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. కొన్ని బుల్లితెర డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు కూడా ఆయన జడ్జిగా వ్యవహరించారు. తాజాగా విజయ్ చౌదరి దర్శకత్వంలో జానీ మాస్టర్ ప్రధాన పాత్రలో ‘రన్నర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ మువీని తెరకెక్కిస్తున్నారు. ఈ మువీతో జానీ మాస్టర్ హీరోగా కూడా మారనున్నారు. ఈ రోజు జానీ మాస్టర్ పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం మువీ టైటిల్ వెల్లడించింది. అలాగే ఈ మువీలో జానీ మాస్టర్ ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేశారు. ఇక ఈ మువీ షూటింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది.
‘అరవింద్ 2’ మువీ నిర్మాతలైన విజయ భాస్కర్, జి. ఫణీంద్ర, ఎం శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ ఢమరుక ఆర్ట్స్ పతాకంపై రన్నర్ మువీని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్‌ను విడుదల సందర్భంగా నిర్మాతలు విజయ్ భాస్కర్, జి ఫణీంద్ర, ఎమ్ శ్రీహరి మాట్లాడుతూ.. ‘జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ఈ మువీలో హీరోగా కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయనది పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ రోల్’ అని తెలిపారు.
హీరోగా జానీ మాస్టర్ క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా ఉండనుంది. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని టాక్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం అందించనున్నారు. ఇక ‘రన్నర్’ ఫస్ట్ లుక్ చూస్తే జానీ మాస్టర్ ఖాకీ ప్యాంట్, షర్టులో వేరియేషన్ చూపించారు. షర్టుకి ఒకవైపు ఖాకి, మరోవైపు తెల్లని ఖద్దర్ ఉంది. షర్టును ఎందుకు అలా డిజైన్ చేశారు.. ఆయన ఎవరికి నమస్కారం పెడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.