Watch Video: హీరోతో బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి నిశ్చితార్ధం.. ‘నేను పిల్లల్ని కనలేనని తెలిసినా..’ అంటూ భావోద్వేగం
బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భట్ తెలియనివారుండరు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోతో బాగా పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా నటి కీర్తి భట్ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. మాటీవీలో బోనాల పండగ సందర్భంగా..
బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి భట్ తెలియనివారుండరు. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్ షోతో బాగా పాపులారిటీ దక్కించుకుంది. తాజాగా నటి కీర్తి భట్ తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. మాటీవీలో బోనాల పండగ సందర్భంగా ప్రసారంకానున్న ‘మా బోనాల జాతర’ ప్రోగ్రాంలో నటుడు విజయ్ కార్తిక్‌తో ఎంగేజ్‌మెంట్ జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే వేదికపై అత్తమామలను కూడా పరిచయం చేసింది. తమ కుటుంబంలోకి కూతురిలా ఆమెను ఆహ్వానిస్తున్నట్లు చెప్పి భావోద్వేగానికి గురయ్యారు.
రోడ్డుప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయి అనాథైన కీర్తి జీవితంలో ఎన్నో కష్టనష్టాలకు ఎదుర్కొని కెరీర్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అదే యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ కీర్తికి తాను జీవితంతో తల్లికాలేదని వైద్యులు చెప్పారు. దీంతో పెళ్లికి ముందే ఓ పాపను దత్తత తీసుకున్నా.. ఆ సంతోషం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. కీర్తికి బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప కూడా మరణించింది.
View this post on Instagram
దర్శకుడు, హీరో విజయ కార్తీక్ నిశ్చితార్ధానికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో కార్తీక్, కీర్తి పూలదండలు మార్చుకుని, ఉంగరాలు మార్చుకున్నారు. ‘నేను కార్తిక్ వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లలేనని నాకు తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్తే.. నీకు పాప ఎందుకమ్మా? నువ్వే మాకు పాపవి. మనం పాపను దత్తత తీసుకుందామన్నారంటూ భావోద్వేగానికి లోనైంది.
View this post on Instagram
ఇక కీర్తికి కాబోయే భర్త కార్తిక్ అసలు పేరు విజయ్ కార్తిక్. చిత్తూరు మదనపల్లిలో పుట్టిపెరిగిన ఉన్నత చదువులు బెంగళూరులో చదివాడు. సినిమాలపై అభిమానంతో కన్నడ నాట కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2014లో సేడు అనే మువీలో తొలిసారిగా హీరోగా నటించాడు. కేజీఎఫ్ మువీ విడుదలకు ముందు రోజే ఈ సినిమా రిలీజ్ కావడంతో అప్పట్లో హాట్‌టాపిక్ అయ్యింది. అలా పలుసినిమాల్లో నటించిన కార్తిక్ ‘ఏబీ పాజిటివ్’ మువీతో దర్శకుడిగా కూడా మారాడు. ఇక తెలుగులోనూ ఓ వెబ్‌సిరీలో, ఏబీ పాజిటివ్, చెడ్డీగ్యాంగ్ అనే మూడు సినిమాల్లో నటించాడు. అన్‌లాక్ అనే మరో మువీ ప్రస్తుతం మేకింగ్‌లో ఉంది. తిమిళంలో కూడా డార్క్ నైట్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.