Tollywood: రమ్యకృష్ణతో ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరో.. బిగ్ బాస్‌లోనూ సందడి
పై ఫొటోలో స్టార్ నటి రమ్యకృష్ణతో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఛైల్డ్ ఆర్టిస్టుగా పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడీ కుర్రాడు. ఏకంగా 40కు పైగా సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రేమకథా చిత్రాలు, కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
పై ఫొటోలో స్టార్ నటి రమ్యకృష్ణతో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఛైల్డ్ ఆర్టిస్టుగా పలువురు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడీ కుర్రాడు. ఏకంగా 40కు పైగా సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రేమకథా చిత్రాలు, కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించినా ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్‌లోనే నటిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. సినిమాల్లోనే కాదు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడీ యంగ్ హీరో. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లోనూ సందడి చేశాడు. మరి ఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ఛైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించి చంటిగాడు సినిమాతో ఆకట్టుకున్న బాలా దిత్య. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాలో బాల నటుడిగా మొదటి సారి వెండి తెరపై కనిపించాడు బాలా దిత్య. మొదటి సినిమాలోనే తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించాడు.
బాలనటుడిగానే 40 కు పైగా సినిమాలు..
ఆ తర్వాత రౌడీ గారి పెళ్లాం, అత్తింట్లో అద్దె మొగుడు, జంబలకిడి పంబ, బంగారు బుల్లోడు, అబ్బాయి గారు. ఏవండి ఆవిడ వచ్చింది, హలో బ్రదర్, అన్నా, తీర్పు, సూపర్ పోలీస్, మాతో పెట్టుకోకు, లిటిల్ సోల్జర్స్, సమరసింహారెడ్డి తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు బాలా దిత్య. ఆ తర్వాత 2003 లో చంటిగాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుందరానికి తొందరెక్కువ, రూమ్ మేట్స్, వేట, జాజిమల్లి , 1940లో ఒక గ్రామం తదితర సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా…
కేవలం వెండితెరపైనే కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ కంటెస్టెంట్ గా మెప్పించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇక చివరిగా మా ఊరి పొలిమేర 2 సినిమాలో కనిపించాడు బాలా దిత్య. ప్రస్తుతం కొన్ని టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.
పుట్టిన రోజు వేడుకల్లో నటుడు బాలాదిత్య.. వీడియో..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి