Manchu Manoj: ‘నాన్నగారూ ఇది మీకు తెలుసా..?’ MBUలో ఆందోళనలపై రియాక్ట్ అయిన మంచు మనోజ్

మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. అయితే ఆయన యూనివర్శిటీ మాత్రం క్రమశిక్షణతో మెలగడం లేదన్నది అక్కడ చదవుతున్న విద్యార్థుల వెర్షన్. దీంతో అక్కడ ఆందోళనలు కూడా జరుగుతున్నాయ్..

Manchu Manoj: 'నాన్నగారూ ఇది మీకు తెలుసా..?' MBUలో ఆందోళనలపై రియాక్ట్ అయిన మంచు మనోజ్
Manchu Manoj
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 15, 2024 | 9:38 AM

కలెక్షన్ కింగ్‌ మోహన్‌బాబు.. ఆయన సినిమాలెన్నో బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించాయ్‌.. సినిమాల్లో ఈ కలెక్షన్లంటే పాజిటివ్‌ టాక్‌..! – కానీ ఇప్పుడు మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల కలెక్షన్లు ఆయనకు నెగిటివ్‌ ఇమేజ్ తెచ్చిపెట్టాయ్‌.. MBU.. అంటే మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజులు, ఇతర ఛార్జీలు ఓ రేంజ్‌లో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి. – నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ.. AICTEకి పేరెంట్స్‌ అసోసియేషన్‌ లేఖ కూడా రాసింది. – ఆ లేఖలో పేరెంట్స్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, IT ఫీజులు వసూలు చేస్తున్నారట.. అలాగే బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేయిస్తున్నారట. డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మెస్‌లో తినాలని కండిషన్‌ పెట్టారట. ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ విషయంపై మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్‌ రియాక్ట్‌ అయ్యారు. నాన్నగారు మంచిమనిషి అంటూనే.. విద్యార్థుల ఆందోళనలకు ఫుల్‌ సపోర్ట్ ప్రకటించారు. విద్యార్థుల ఆందోళన తనను బాధపరిచిందన్న మంచు మనోజ్‌.. విషయాన్ని  వర్సిటీ ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబు దృష్టికి తీసుకెళతానని Xలో పోస్ట్‌ చేశారు.  విద్యార్థులు, తల్లిదండ్రులు, AISFకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు.  ఈ అంశంపై వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినయ్‌ని వివరణ కోరినట్లు చెప్పారు.  రాయలసీమ వాసులు, విద్యార్థుల ప్రయోజనాలకే.. ఛాన్సలర్‌ మోహన్‌బాబు ప్రాధాన్యం ఇస్తారన్నారు మంచు మనోజ్‌.

ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్శిటీ, శ్రీవిద్యానికేతన్‌ సంస్థలు మోహన్ బాబు పెద్ద తనయుడు విస్ణు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.  తన అన్న నిర్వహణలో ఉన్న విద్యాసంస్థలపై ఆరోపణలు వస్తే ఖండించాల్సిన మనోజ్.. రివర్స్‌లో అక్కడ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం అంటే వారి ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయనే టాక్ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.