SIIMA Awards 2024: అట్టహాసంగా సైమా అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ నటుడిగా నాని.. బెస్ట్ తెలుగు మూవీ ఏదంటే?

సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)- 2024 అవార్డుల ప్రదానోత్సవం శనివారం (సెప్టెంబర్ 14) సాయంత్రం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తొలిరోజు కన్నడ, తెలుగు భాషల్లో ఎంపికైన చిత్రాలకు అవార్డులు పంపిణీ చేశారు. తమిళ, మలయాళ చిత్రాలకు ఆదివారం (సెప్టెంబర్ 15) అవార్డులు అందజేయనున్నారు.

SIIMA Awards 2024: అట్టహాసంగా సైమా అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ నటుడిగా నాని.. బెస్ట్ తెలుగు మూవీ ఏదంటే?
Siima 2024 Awards
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2024 | 10:22 AM

సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)- 2024 అవార్డుల ప్రదానోత్సవం శనివారం (సెప్టెంబర్ 14) సాయంత్రం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తొలిరోజు కన్నడ, తెలుగు భాషల్లో ఎంపికైన చిత్రాలకు అవార్డులు పంపిణీ చేశారు. తమిళ, మలయాళ చిత్రాలకు ఆదివారం (సెప్టెంబర్ 15) అవార్డులు అందజేయనున్నారు. తెలుగు పురస్కారాలకు సంబంధించి ‘దసరా’, హాయ్ నాన్న, ‘బలగం’ చిత్రాలు ఎక్కువ అవార్డులు సాధించాయి. 2024 సంవత్సరానికి గానూ ‘దసరా’ మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని , ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌ అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్‌ కేసరి’ నిలిచింది. ఇక కన్నడలో ‘సప్త సాగరదాచే ఎల్లో’, దర్శన్ నటించిన ‘కటేరా’ చిత్రాలు ఎక్కువ అవార్డులు గెలుచుకున్నాయి.

ఇవి కూడా చదవండి

‘సైమా’ 2024 అవార్డుల విజేతలు వీళ్లే!

  • ఉత్తమ నటుడు – నాని (దసరా)
  • ఉత్తమ నటి – కీర్తి సురేష్ (దసరా)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – ఆనంద్ దేవరకొండ (బేబీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ దర్శకుడు – శ్రీకాంత ఓదెల (దసరా)
  • ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)- సాయి రాజేష్ (బేబీ)
  • ఉత్తమ తెలుగు చిత్రం- భగవంత్ కేసరి ఉత్తమ గాయకుడు- రామ్ మిరియాల (బలగం)
  • ఉత్తమ సహాయ నటుడు – దీక్షిత్ శెట్టి (దసరా)
  • ఉత్తమ సహాయ నటి- కియారా ఖన్నా (హాయ్ నాన్నా)
  • ఉత్తమ నూతన దర్శకుడు – శౌర్యువ్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ నూతన నటుడు – సంగీత్ (మ్యాడ్)
  • ఉత్తమ ప్రామిసింగ్ యాక్టర్ – సుమంత్ ప్రభాస్ (మేం ఫేమస్)
  • ఉత్తమ నూతన నటి – వైష్ణవి (బేబీ)
  • ఉత్తమ సంగీత దర్శకుడు – హేషమ్ అద్బుల్ వహాబ్ (హాయ్ నాన్న)
  • ఉత్తమ సాహిత్యం- అనంత్ (బేబీ)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – భువన్ గౌడ (సలార్)
  • ఉత్తమ హాస్యనటుడు – విష్ణు (మ్యాడ్)
  • ఉత్తమ పరిచయ నిర్మాత: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (హాయ్‌ నాన్న)

సైమా అవార్డ్స్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.