Tollywood: ఈ ఇంజినీరింగ్ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. మెగాస్టార్‌కు బాగా ఇష్టం.. గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సత్తా చాటుతోన్నహీరోలు చాలా కొద్ది మందే ఉన్నారు. అందులో ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ కూడా ఒకడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల పక్కన సైడ్ రోల్స్ చేసిన ఈ నటుడు ఇప్పుడు క్రేజీ హీరోగా మారిపోయాడు.

Tollywood: ఈ ఇంజినీరింగ్ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. మెగాస్టార్‌కు బాగా ఇష్టం.. గుర్తు పట్టారా?
Tollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2024 | 2:14 PM

పై ఫొటోలో రాముడు మంచి బాలుడిలా ముసి ముసినవ్వులు నవ్వుతోన్న అబ్బాయెవరో గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా మంచి నటుడిగా ఎదిగిన అతి కొద్దిమందిలో ఇతను కూడా ఒకడు. విశాఖలో పుట్టి పెరిగాడు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో డిగ్రీ అందుకున్నాడు. ఐబీఎమ్ లాంటి ఐటీ దిగ్గజ సంస్థల్లో పని చేశాడు. కానీ నటనంటే చాలా ఇష్టం కదా! అందుకే లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి పెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న చితకా రోల్స్ చేశాడు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కల్యాణ్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడిగా మెప్పించాడు. తన సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు. అయితే నటుడు అన్నాక అన్ని పాత్రలు చేయాల్సిందే. అందుకే ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్, సహాయక నటుడి పాత్రలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ఈ నటుడి ట్యాలెంట్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం మురిసిపోయారు. తన మూడో తమ్ముడంటూ కితాబు కూడా ఇచ్చేశారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు సత్యదేవ్. ఈ శుక్రవారం (నవంబర్ 22) అతను నటించిన జీబ్రా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సత్యదేవ్ కు సంబంధించిన చిన్న నాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

2018లో వచ్చిన బ్లఫ్ మాస్టర్ తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆ తర్వాత అతను కథానాయకుడిగా నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం, గాడ్సే, కృష్ణమ్మ సినిమాలు కూడా ఆడియెన్స్ ను మెప్పించాయి. ఇక చిరంజీవి గాడ్‌ ఫాదర్ లో క్రూరమైన విలన్ గా ఆకట్టుకున్నాడు. రామసేతు సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ ను కూడా మెప్పించాడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత జీబ్రా అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

ఇవి కూడా చదవండి

సత్యదేవ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి