- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun Pushpa 2 the rule movie records before release in theaters, details here
Allu Arjun-Pushpa 2: రిలీజ్ కి ముందే పుష్పరాజ్ రికార్డుల మోత.! మాములుగా లేదుగా..
మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది కానీ.. పైసా తగ్గదు అనే మాటను చాలా సార్లు సినిమాల ప్రమోషన్లలో వింటూనే ఉంటాం. కానీ నిజంగానే ఎంతైనా ఊహించుకుంటే.. తీరా ఫలితాలు విడుదలయ్యే రోజు పరిస్థితి కంట్రోల్‌లోనే ఉంటుందా? అలాంటి అనుమానాలేం అక్కర్లేదనే భరోసా కనిపిస్తోంది పుష్పరాజ్ టీమ్‌లో.. రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా నాన్ బాహుబలి రికార్డ్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది.
Updated on: Nov 22, 2024 | 2:08 PM

మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించే ఉంటుంది కానీ.. పైసా తగ్గదు అనే మాటను చాలా సార్లు సినిమాల ప్రమోషన్లలో వింటూనే ఉంటాం.

కానీ నిజంగానే ఎంతైనా ఊహించుకుంటే.. తీరా ఫలితాలు విడుదలయ్యే రోజు పరిస్థితి కంట్రోల్‌లోనే ఉంటుందా? అలాంటి అనుమానాలేం అక్కర్లేదనే భరోసా కనిపిస్తోంది పుష్పరాజ్ టీమ్‌లో..

రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడల్లా నాన్ బాహుబలి రికార్డ్స్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. నాన్ బాహుబలి ఎందుకు? అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలిని, ఆ మధ్య విడుదలైన ట్రిపుల్ ఆర్‌నీ కూడా గేమ్‌లోకి తీసుకొచ్చేయండి..

అన్నిటినీ కొట్టేయడానికి మన పుష్పరాజ్ రెడీ అవుతున్నారన్నది మైత్రీ మూవీస్ కాంపౌండ్‌లో స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న మాట. ఇంతకీ ఇప్పుడు అర్జంటుగా పుష్పరాజ్ బద్ధలు కొట్టాల్సిన రికార్డు ఏంటంటారా?

డే ఒన్ రికార్డులు.. డే ఒన్ 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన క్రెడిట్ ఇప్పటిదాకా ట్రిపుల్ ఆర్, బాహుబలి2కి మాత్రమే ఉంది.. వాటిని మించి వసూలు చేసి.. వసూళ్లలో మాస్ జాతర చూపించేయాలన్నది ఐకాన్ స్టార్ ఆలోచన.

ఈ మధ్య విడుదలైన కల్కి 191 కోట్లు కలెక్ట్ చేస్తే, దేవర 157 వరకూ వచ్చింది. వీళ్లందరిదీ ఓ లెక్క.. మనది వేరే లెక్క అని లెక్కలు తిరగరాయడానికి రెడీ అవుతున్నారు బన్నీ.

రీసెంట్‌గా పాట్నాలో కనిపించిన క్రౌడ్ డే ఒన్ థియేటర్లలో సందడి చేస్తే అదేం అంత పెద్ద పనేం కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్.. ఆ ధైర్యంతోనే పుష్పరాజ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు మూవీ లవర్స్.





























