- Telugu News Photo Gallery Cinema photos Heroine Pooja Hegde focus on glamorous photoshoot due to no movie offers details here on November 2024
Pooja Hegde: తెలిసే చేసినా.. తెలియకుండా చేసినా.. నష్టం జరిగిపోయింది అమ్మడు..
తెలిసే చేసినా.. తెలియకుండా చేసినా.. కొన్ని పొరపాట్ల వల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని పూజా హెగ్డేలాంటివారికి ప్రత్యేకించి చెప్పాలా.? మామూలుగా అయితే నో అనే ఆన్సరే వినిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ మాట చెప్పి చూడండి అనే సలహాలు కూడా ఉన్నాయి.. ఇంతకీ పూజకి ఏం చెప్పాలి.? పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో నటించి ఎన్నేళ్లయిందో తెలుసా.. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యాయి.
Updated on: Nov 22, 2024 | 1:57 PM

వారిద్దరూ భార్యాభర్తలుగా నటించారు ఈ సినిమాలో. ప్రతి సన్నివేశంలోనూ ఒకరిని మించి మరొకరు నేచురల్‌గా నటించారు.

అదే జరిగితే.. చాన్నాళ్లుగా తెలుగులో రీ ఎంట్రీకి ట్రై చేస్తున్న పూజా హెగ్డేకి జబర్దస్త్ ఛాన్స్ అవుతుందంటూ సంబరపడుతున్నారు ఫ్యాన్స్.

త్వరలోనే ఇలాంటి ఛాన్స్ పూజా హెగ్డేకి రాబోతోందన్నది ఫిల్మ్ నగర్ న్యూస్. ఓ కొత్త డైరక్టర్ చెప్పిన కథకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో పూజా హెగ్డేని హీరోయిన్‌గా అనుకుంటున్నారట.

ఆచార్య వచ్చింది. టాలీవుడ్‌లో పూజ కెరీర్‌కి ఢోకా లేదనే ఫీలింగ్ కూడా కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సౌత్‌లో కలర్‌ఫుల్ కెరీర్‌ని కాదనుకుని నార్త్ బాట పట్టారు పూజా.

ఇన్‌ఫ్యాక్ట్ సీతారామమ్ జంటని మళ్లీ మళ్లీ వెండితెరమీద చూడాలని కోరుకున్న వారు కోకొల్లలు. అంతగా మెప్పించింది దుల్కర్, మృణాల్ కెమిస్ట్రీ. రీసెంట్‌గా లక్కీ భాస్కర్‌లోనూ మీనాక్షి చౌదరికి అలాంటి ఫెసిలిటీ కల్పించారు దుల్కర్.

ఎఫ్3 లో లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలి తర్వాత.. పాటలకు స్పెషల్‌గా స్టెప్పులేయడం కూడా మానేశారు. ప్రస్తుతానికి హిందీలో డిలే అవుతున్న దేవా మూవీ.. 2025లో రిలీజ్‌కి రెడీ అవుతోంది.

సూర్యతో సూర్య44 మూవీ చేశారు పూజ. అలాగే దళపతి విజయ్ ఆఖరి సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో సాయిధరమ్‌తేజ్‌తో జోడీ కడతారనే మాటలు వినిపించినా.. అందులో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది.

పొరుగు ఇండస్ట్రీలన్నీ తెలుగువారికి దగ్గరవుతుంటే.. పూజ మాత్రం తెలుగువారికి ఎందుకు దూరం జరుగుతున్నారన్నది చాలా మందిలో ఉన్న డౌట్.





























