- Telugu News Photo Gallery Cinema photos Tollywood is busy with shooting and Who is in which location?
Movie Updates: షూటింగ్స్‌తో బిజీ బిజీగా టాలీవుడ్.. ఎవరు ఏ లొకేషన్లో ఉన్నారు.?
మళ్లీ అదే మాట... అప్పుడే కొత్త వారం వచ్చేసింది. సోమవారం సరికొత్తగా షూటింగులకు హాజరయ్యారు మన హీరోలు. సేమ్ లొకేషన్లకు వెళ్లేవారు ఎంత మంది? లొకేషన్లు షిఫ్ట్ అయినవారు ఎందరు? ఇంతకీ ఏ కెప్టెన్ ఏ లొకేషన్‌ని ఫైనల్ చేశారు? చూసేద్దాం పదండి...
Updated on: Nov 22, 2024 | 1:56 PM

అశోక క్రియేషన్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నటిస్తున్న ఎన్‌కేఆర్21 సినిమా నయా షెడ్యూల్ హలో నేటివ్ స్టూడియోలో మొదలైంది. గత కొన్ని వారాలుగా ఇక్కడే శర్వానంద్ సినిమా కోసం సెట్‌వర్క్ చేస్తున్నారు. నీరజ కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న 'తెలుసు కదా' సినిమా షూటింగ్ పుణెలో జరుగుతోంది.

నాని హీరోగా నటిస్తున్న హిట్3 కోటి ఉమెన్స్ కాలేజీకి షిఫ్ట్ అయింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న రాబిన్‌హుడ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రీకరణ కూడా అక్కడే స్పీడందుకుంది.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ మూవీని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ సినిమా అజీజ్‌నగర్‌లోని పీపుల్ మీడియా స్టూడియోలో వేగం పుంజుకుంది.

గేమ్ చేంజర్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లొకేషన్‌కి వెళ్తున్నారు కెప్టెన్ శంకర్. అల్లు అర్జున్ పుష్ప2 కోసం... బాచుపల్లిలో ఒకటి, అన్నపూర్ణ స్టూడియోలో ఇంకొకటి.. రెండుయూనిట్లు పనిచేస్తున్నాయి.

నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభూ అన్నపూర్ణ స్టూడియోకి ఫిక్స్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర జపాన్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. రవితేజ హీరోగా భాను దర్శకత్వం వహిస్తున్న సినిమా శంకర్ పల్లిలో జరుగుతోంది.




