AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ గుండు పాపను గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆరు భాషల్లో ప్రావీణ్యం

ఏడేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఛైల్డ్ ఆర్టిస్టుగా దళపతి విజయ్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. కమర్షియల్ సినిమాలు కాకుండా కేవలం నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: ఈ గుండు పాపను గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆరు భాషల్లో ప్రావీణ్యం
Tollywood Actress
Basha Shek
|

Updated on: Nov 30, 2025 | 6:14 PM

Share

ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ప్రస్తుతం ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయకిగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ మూవీస్ తోనూ మెప్పిస్తుందీ అందాల తార. చాలా మంది హీరోయిన్ల లాగే ఈ బ్యూటీ కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. చిన్నప్పుడే విజయ్ దళపతి వంి స్టార్ హీరోల సినిమాల్లో బాల నటిగా మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి సినిమాల్లో బాగా పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. తెలుగుతో అయితే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తమిళంలో రజనీకాంత్, విజయ్ దళపతి తదిరత హీరోల సినిమాల్లో యాక్ట్ చేసింది. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ చేతికొచ్చిన ప్రతి సినిమాలోనూ అద్భుతంగా నటించింది. చాలా ఏళ్లుగా హీరోయిన్ గా మెప్పిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యన మొదటిసారిగా అమ్మ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆమె మరెవరో కాదు నటి నివేదా థామస్.

నివేదా థామస్ నవంబర్ 2, 1995న కేరళలోని కన్నూర్‌లో జన్మించింది. ఏడేళ్ల వయసులోనే మలయాళ చిత్రం ఉత్తరలో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత, “మై డియర్ భూతం” అనే టీవీ సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యింది. 2008లో కురువి చిత్రంలో దళపతి విజయ్ సోదరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత, శశికుమార్ చిత్రం బోరలిలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.

ఇవి కూడా చదవండి

నివేదా థామస్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

తెలుగులో జెంటిల్మెన్, నిన్నుకోరి, జై లవకుశ, 118, బ్రోచెవారెవరురా, వీ, వకీల్ సాబ్, శాకిని డాకిని, 35 చిన్న కథ కాదు తదితర సినిమాల్లో నటించింది నివేద. ముఖ్యంగా 35 చిన్న కథ కాదు సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుందీ అందాల  తార.

ట్రెడిషినల్ వైట్ శారీలో నివేదా థామస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us