Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ హీరోయిన్..
ఇటీవల నెట్టింట ట్రెండ్ అవుతున్న త్రోబ్యాక్ ఫోటోలలో భాగంగా ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోను మీ ముందుకు తీసువచ్చాము. ఎవరో కనిపెట్టగలరా..
పైన ఫోటోలో ఉన్న క్యూట్ చిన్నారి ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఫేమస్ హీరోయిన్. అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తల్లిదండ్రులు ఒకప్పటీ స్టార్ హీరోహీరోయిన్స్. గుర్తుపట్టండి. ఇటీవల నెట్టింట ట్రెండ్ అవుతున్న త్రోబ్యాక్ ఫోటోలలో భాగంగా ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోను మీ ముందుకు తీసువచ్చాము. ఎవరో కనిపెట్టగలరా.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మరోవైపు తమిళ్ ఇండస్ట్రీలోని అదృష్టాన్ని పరీక్షించుంకుంటుంది. గుర్తుపట్టండి.
ఆ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్. సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె. దొరసాని సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు.. నటనపరంగా ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. మొదటి సినిమాతే ఉత్తమ నూతన హీరోయిన్ గా సైమా 2019 అవార్డ్ అందుకుంది. అలాగే ఆమె ప్రస్తుతం పంచతంత్రం, రంగమార్తండ, విధి విలాసం, ఆనందం విలైయాడుం వీడు చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకనున్నాయి.
ఇక తాజాగా ఈ అమ్మడు నటిస్తోన్న చిత్రం నీదా వానం సినిమా తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ కానుంది. ఇందులో అశోక్ సెల్వన్ కథానాయికుడిగా నటిస్తుండగా.. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.