AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 48 ఏళ్ల వయసులోనూ అభిమానుల గుండెలకు గాయం చేసే హీరోయిన్.. ఆమె ప్రేమకథలు మజిలీ చేరనివే..

ఇండస్ట్రీలోని పలువుర్ స్టార్స్ తమ జీవితంలో ప్రత్యేకమైన రోజులను గుర్తుచేసుకుంటూ తమ త్రోబ్యాక్, చైల్డ్ హుడ్ ఫోటోస్ పంచుకుంటూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఓ సీనియర్ హీరోయిన్ అరుదైన పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 48 సంవత్సరాలు. అయినప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది.

Tollywood: 48 ఏళ్ల వయసులోనూ అభిమానుల గుండెలకు గాయం చేసే హీరోయిన్.. ఆమె ప్రేమకథలు మజిలీ చేరనివే..
Actress
Rajitha Chanti
| Edited By: |

Updated on: Oct 13, 2024 | 8:00 AM

Share

అరెరే.. ఇప్పుడు ఎక్కడ చూసిన సినీతారల చిన్ననాటి చిత్రాలే. కొన్నాళ్లు సోషల్ మీడియాలో ఈ త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ తెగ వైరలవుతుంది. సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న నెటిజన్స్.. వారికి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలను కూడా పంచుకుంటున్నారు. అలాగే ఇటు ఇండస్ట్రీలోని పలువుర్ స్టార్స్ తమ జీవితంలో ప్రత్యేకమైన రోజులను గుర్తుచేసుకుంటూ తమ త్రోబ్యాక్, చైల్డ్ హుడ్ ఫోటోస్ పంచుకుంటూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఓ సీనియర్ హీరోయిన్ అరుదైన పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 48 సంవత్సరాలు. అయినప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరో తెలుసా. తనే మాజీ మిస్ వరల్డ్ సుష్మితా సేన్.

ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న సుష్మితా సేన్ త్రోబ్యాక్ ఫోటో 29 ఏళ్లనాటిది. గతంలో ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ సుధీర్ఘ మెసేజ్ పంచుకుంది. సుష్మితా సేన్ మాజీ ప్రపంచ సుందరి. దాదాపు రెండు దశాబ్దాలపాటు సినీరంగంలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టా్ర్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్స్ అందుకుంది. ఈ అమ్మడుకు అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యాభై ఏళ్లకు దగ్గరకు వస్తోన్న చెక్కు చెదరని అందంతో సినీ ప్రియులను కట్టిపడేస్తుంది.

18 ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది సుష్మితా సేన్. నాటి చారిత్రాత్మక విషయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నోట్ రాసి.. కొన్ని క్లాసిక్ ఫోటోస్ షేర్ చేసింది. ఈ ఫోటో సరిగ్గా 29 సంవత్సరాల క్రితం నాటిదని.. దానిని ఎపిక్ మ్యాన్ ఫోటోగ్రాఫర్ ప్రబుద్ధ దాస్ గుప్తా ఫ్లాష్ చేసారని చెప్పుకొచ్చింది. అప్పుడు తన వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే అని.. ఆ ఫోటో తీసి మొదటి మిస్ యూనివర్స్ నువ్వేనని అన్నాడని గుర్తుచేసుకుంది. భారతదేశపు మొట్ట మొదటి మిస్ యూనివర్స్ ఈ ఫోటోనే అని నేను గర్వంగా అన్నానని, ఇప్పటికీ తన గెలుపు గుర్తుకు వస్తే నాకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని రాసుకొచ్చింది. భారతదేశం మొట్టమొదటిసారిగా 21 మే 1994న మనీలా ఫిలిప్పీన్స్ లో (మహల్ కియా) మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది సుష్మితా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.