Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చక్కనమ్మ.. చిక్కేనమ్మ.. కూలింగ్ గ్లాసెస్ చిన్నది ఎవరో గుర్తుపట్టారా ?.. ఆ స్టార్ హీరో డాటర్..

ఫోటోను చూశారు కదా. ఆ కూలింగ్ గ్లాసెస్ చిన్నది బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలను అందిస్తూ తెగ బిజీ అయిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఫేమస్ నటీనటులు. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సహాయ పాత్రలతో మెప్పిస్తున్నారు. గుర్తుపట్టారా ?.. ఈ బ్యూటీ సోదరుడు హీరోగా కాకుండా డైరెక్టర్‏గా పరిచయమవుతున్నారు.

Tollywood: చక్కనమ్మ.. చిక్కేనమ్మ.. కూలింగ్ గ్లాసెస్ చిన్నది ఎవరో గుర్తుపట్టారా ?.. ఆ స్టార్ హీరో డాటర్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 10, 2023 | 5:02 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో స్టార్స్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంటాయి. వారి సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆరా తీస్తుంటారు. ముఖ్యంగా కొన్ని రోజులుగా టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారల చిన్ననాటి ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ బ్యూటీ లేటేస్ట్ క్రేజీ స్టిల్స్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. ఆ కూలింగ్ గ్లాసెస్ చిన్నది బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలను అందిస్తూ తెగ బిజీ అయిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఇండస్ట్రీలో ఫేమస్ నటీనటులు. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు సహాయ పాత్రలతో మెప్పిస్తున్నారు. గుర్తుపట్టారా ?.. ఈ బ్యూటీ సోదరుడు హీరోగా కాకుండా డైరెక్టర్‏గా పరిచయమవుతున్నారు. పైన ఫోటోలో ఆ హీరోయిన్ పక్కనే తన తల్లి కూడా కనిపిస్తున్నారు. గుర్తుపట్టే ఉంటారు కదూ.. తనే సారా అలీ ఖాన్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ దంపతుల గారాల పట్టి.

కొలంబియా యూనివర్సిటీలో హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన సారా.. ఆ తర్వాత 2018లో కేదార్ నాథ్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. ఇందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది సారా. ఆ తర్వాత అక్షయ్ కుమార్ జోడిగా సింబా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాందించుకుంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలే ఈ బ్యూటీ జరా హాట్కే జరా బచ్కే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. ఇక ప్రస్తుతం సారా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అటు మూవీస్ చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సారా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన తల్లి అమృతా సింగ్ తో కలిసి లండన్ వేకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి అందమైన ప్రదేశాలలో తన తల్లితో కలిసి తీసుకున్న సెల్ఫీలను ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు సారా. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.