Tollywood : చేసిందే ఒక్క సినిమా.. ఏకంగా హారతులు పట్టిన అభిమానులు.. కట్ చేస్తే.. ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..
సౌత్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీపై డైరెక్టర్ రాజమౌళి సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఫస్ట్ మూవీ క్రేజ్ తో వరుస ఆఫర్స్ అందుకుంటుందని అనుకున్నారు అంతా. కానీ అలా కాకుండా ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ.

దక్షిణాది చిత్రపరిశ్రమలో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె యువతకు ఇష్టమైన హీరోయిన్. అంతేకాదు.. ఆమె యాక్టింగ్ చూసి డైరెక్టర్ రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆమె పై ప్రశంసలు కురిపించారు. ఫస్ట్ మూవీతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మమితా బైజు. ప్రేమలు సినిమాతో దక్షిణ భారత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన మమిత ఇప్పుడు మలయాళ చిత్రసీమలో ఒక ప్రకాశవంతమైన తార.
మమితకు చాలా మంది అభిమానులు, కొన్ని సినిమాలు చేసింది. మమిత తమిళం, తెలుగు రెండింటిలోనూ తన ఉనికిని చాటుకుంటోంది. మమిత ‘రెబెల్’ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. మమిత ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జన నాయకన్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో మమిత హీరోయిన్ తో సమానమైన పాత్రను పోషిస్తుంది. మమిత ‘డియర్ కృష్ణ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతోంది. మలయాళంలో ప్రేమలు రెండవ భాగం కోసం మమిత కూడా వెయిట్ చేస్తుంది.
మమిత తొలి చిత్రం 2017లో విడుదలైన సర్వోపరి పాలకన్. తరువాత, మమిత హనీ బీ 2, డాకిని, వరతన్, యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ, వికృతి, ఆపరేషన్ జావా, దువా, సూపర్ శరణ్య, ప్రణయవిలాసం, రామచంద్ర బోస్ వంటి అనేక చిత్రాల్లో నటించింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..