Seetimaarr Movie : నేనా నువ్వా.. నీదా నాదా అంటున్న జట్లు.. ‘సీటీమార్’ నుంచి కబడ్డీ ఆంథమ్ లిరికల్ ..
మాచో హీరో గోపీచంద్ సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. విలన్‌గా మెప్పించిన గోపీచంద్ ఆతర్వాత హీరోగా మారి ఆకట్టుకున్నాడు. యజ్ఞం, లౌక్యం, లక్ష్యం వంటి సిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు

Seetimaarr Movie : మాచో హీరో గోపీచంద్ సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. విలన్‌గా మెప్పించిన గోపీచంద్ ఆతర్వాత హీరోగా మారి ఆకట్టుకున్నాడు. యజ్ఞం, లౌక్యం, లక్ష్యం వంటి సిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఈ మధ్య కాలంలో గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఇటీవల వరుస సినిమాలు చేస్తూ వచ్చినా హిట్ మాత్రం అనుకోలేదు ఈ మ్యాచో హీరో. ఇక ఇప్పుడు సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మాస్ గేమ్ కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో ఆంధ్రా మహిళల టీమ్ కోచ్‌గా గోపిచంద్.. తెలంగాణ మహిళల టీమ్ కోచ్‌గా తమన్నా కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ పైన దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా సీటిమార్ నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు.’కబడ్డీ ఆంథమ్’ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. నువ్వా నేనా.. నేనా నువ్వా.. నీదా నాదా.. నాదా నీదా..’ అంటూ సాగిన ఈ పాటకు సంగీత బ్రహ్మ మణిశర్మ ట్యూన్ కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి , సాయి చరణ్, రమ్య బెహరా, సాహితీ చాగంటి ఈ పాటను ఆలపించారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషించారు. రెహమాన్, రావు రమేష్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :




