సినిమా లవర్స్‌కు బంపరాఫర్‌.. ఈ కొత్త సినిమా టికెట్‌ కేవలం రూ.1 మాత్రమే .. పూర్తి వివరాలివే

ఇటీవల మేమ్‌ ఫేమస్‌ అనే సినిమా మొదటి రోజున కేవలం రూ. 99 లకే టికెట్లు విక్రయించింది. తద్వారా తమ సినిమా మరింతగా జనాల్లోకి వెళుతుందని భావించారు. అందుకు తగ్గట్టే ఆ సినిమా డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది.

సినిమా లవర్స్‌కు బంపరాఫర్‌.. ఈ కొత్త సినిమా టికెట్‌ కేవలం రూ.1 మాత్రమే .. పూర్తి వివరాలివే
Yadha Yadha Hi Movie
Follow us
Basha Shek

|

Updated on: May 30, 2023 | 5:46 PM

ఎంతకాదన్నా ఈ మధ్యన సినిమా టికెట్ల రేట్లు భారీగా పెరిగిపోయాయి. సింగిల్‌ స్క్రీన్‌ అయినా మల్టీ ఫ్లెక్స్‌ అయినా ఏదైనా కొత్త సినిమా చూడాలంటే వందలాది రూపాయలు ఖర్చ పెట్టాల్సి వస్తోంది. అందుకే చాలామంది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈక్రమంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మూవీ మేకర్స్‌ వినూత్న పద్ధతుల్లో ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇటీవల మేమ్‌ ఫేమస్‌ అనే సినిమా మొదటి రోజున కేవలం రూ. 99 కే టికెట్లు విక్రయించింది. తద్వారా తమ సినిమా మరింతగా జనాల్లోకి వెళుతుందని భావించారు. అందుకు తగ్గట్టే ఆ సినిమా డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పుడీ జాబితాలో మరొక సినిమా చేరింది. అది కూడా కేవలం రూ. 1 కే సినిమా చూసే అవకాశం కల్పించింది. అయితే అది తెలుగు సినిమా కాదు. ‘యదా యదా హి’ అనే కన్నడ మూవీ. అశోక్‌ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే అంతకంటే ముందుగా మే 31న అంటే బుధవారం సాయంత్రం ‘యాదా యాదా హి’ ప్రీమియర్ షోలు బెంగళూరులోని వీరేష్ సినిమాస్, హుబ్బళ్లిలోని సుధా సినిమాస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇందు కోసం కేవలం రూ.1 కే టికెట్‌ విక్రయించనున్నారు. యాదా యాదా హి సినిమాలో పిల్ల జమీందార్‌ ఫేమ్‌ హరిప్రియ, వశిష్ట సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అడివిశేష్‌ నటించిన ఎవరు సినిమాకు ఇది కన్నడ రీమేక్‌గా రూపొందింది. హైదరాబాద్ కు చెందిన రాజేష్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించగా హర్షవర్ధన్‌ రాజ్‌ స్వరాలు సమకూర్చాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Hariprriya (@iamhariprriya)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..