Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన సాయి పల్లవి.. కానీ ఆ సినిమా ఛాన్స్ ఎలా మిస్సయ్యిందంటే..
గీతా గోవిందం తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా డియర్ కామ్రేడ్ . అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. థియేటర్లలో ఈ మూవీ ఎక్కువగా వసూళ్లు సాధించకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి హిట్స్ అందుకున్న ఈహీరో ప్రస్తుతం ఖుషి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విజయ్, రష్మిక జోడికి ఎక్కువగానే అభిమానులు ఉన్నారు. గీతా గోవిందం తర్వాత వీరిద్దరు కలిసి నటించిన సినిమా డియర్ కామ్రేడ్ . అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. థియేటర్లలో ఈ మూవీ ఎక్కువగా వసూళ్లు సాధించకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ లిల్లీ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదనే విషయం మీకు తెలుసా ?. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకో రష్మిక పోషించిన లిల్లీ పాత్రకు న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మొదటి ఎంపికట.
ఈ సినిమా కోసం ముందుగా సాయి పల్లవిని సంప్రదించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ఛాన్స్ వదులుకున్నారట. ఆ తర్వాత ఈ ఆఫర్ రష్మికకు చేరింది. డియర్ కామ్రేడ్ మాత్రమే కాదు, అజిత్ కుమార్ నటించిన తునివు, దళపతి విజయ్ నటిస్తోన్న లియో చిత్రాలకు సాయి పల్లవి సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం సాయి పల్లవి తమిళ్ హీరో శివకార్తికేయన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. మొదటిసారి శివకార్తికేయన్ సరసన నటిస్తుంది సాయి పల్లవి. దీంతో ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది.
డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఒకేసారి విడుదలైంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను సంపాదించినప్పటికీ, ప్రధాన పాత్రలలో రష్మిక, విజయ్‌ల హృదయపూర్వక నటనను ప్రేక్షకులు ఇష్టపడ్డారు.