AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ.. ‘విశ్వక్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అజయ్‌ నటించిన చిత్రం విశ్వక్. మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదలైంది. అయితే సరిగా ప్రమోషన్స్‌ లేకపోవడంతో పెద్దగా ఆడలేకపోయింది. అయితే అజయ్‌ నటనకు మంచి పేరొచ్చింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Vishwak: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్‌ మూవీ.. 'విశ్వక్‌' స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Vishwak Movie
Basha Shek
|

Updated on: May 30, 2023 | 6:26 PM

Share

ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు అజయ్‌ కతుర్వార్‌. గతంలో రాగల 24 గంటల్లో, అలాంటి సిత్రాలు తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించాడీ యంగ్ హీరో. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే అతను మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలా అజయ్‌ నటించిన చిత్రం విశ్వక్. మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదలైంది. అయితే సరిగా ప్రమోషన్స్‌ లేకపోవడంతో పెద్దగా ఆడలేకపోయింది. అయితే అజయ్‌ నటనకు మంచి పేరొచ్చింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ జీ5 విశ్వక్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా జీ5 ఓటీటీలో ఈ యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా విశ్వక్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది జీ5. ‘ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన సినిమా విశ్వక్. జూన్ 2 నుంచి జీ 5 స్ట్రీమింగ్‌ అవ్వనున్న విశ్వక్‌ సినిమాని మిస్‌ అవ్వకుండా ఫ్రీగా చూడండి’ అని ట్వీట్‌ చేసింది. విదేశీమోజు లో ప‌డిపోయిన యువతరం ఆలోచ‌నా విధానం మారాల‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు వేణు ముల్క‌ల్ల ఈ సినిమాను తెర‌కెక్కించారు.డింపుల్ హీరోయిన్‌గా నటించింది. తాటికొండ ఆనందం బాలకృష్ణ ఈ సినిమాను నిర్మించగా, సత్య సాగర్ పోలం స్వరాలు సమకూర్చాడు. ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. మరి థియేటర్లలో విశ్వక్‌ సినిమాను మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ పోస్ట్
ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ పోస్ట్
చేదు లేకుండా కాకకర కాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?
చేదు లేకుండా కాకకర కాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?
బాబా వంగా జ్యోతిష్యం.. మరో వారంలో బాగా డబ్బు సంపాదించే రాశులివే
బాబా వంగా జ్యోతిష్యం.. మరో వారంలో బాగా డబ్బు సంపాదించే రాశులివే
మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..
మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..
ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!
ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!