Ranya Rao : రన్యా రావు బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ట్విస్ట్.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నటి రన్యా రావు బెయిల్ దరఖాస్తుపై విచారణ ముగిసింది. డిఆర్‌ఐ తరపున న్యాయవాది మధురావు వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది కిరణ్ జవాలి రన్యా రావు తరపున వాదించారు.బెంగళూరులోని 64వ CCH కోర్టు, ఇరువైపుల వాదనలు విన్న తర్వాత, బెయిల్ ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. రన్యా రావు బెయిల్ ఉత్తర్వు మార్చి 27న ప్రకటించనున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు కోర్టులో మళ్లీ నిరాశే ఎదురయ్యింది. రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది న్యాయస్థానం. ఈనెల 27వ తేదీన తీర్పును వెల్లడించబోతోంది కోర్టు.. రన్యా రావు విచారణకు సహకరించడం లేదని కోర్టుకు DRI తరపు న్యాయవాది విన్నవించారు. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తునట్టు తెలిపారు. హవాలా డబ్బుతో తాను బంగారం కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడించారు రన్యా రావు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావు నేరాన్ని అంగీకరించారని DRI కోర్టుకు తెలిపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో రన్యా రావును మార్చి 3వ తేదీన DRI అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావు సవతి తండ్రి , డీజీపీ రామచంద్రారావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారం తనకు తెలియదని రామచంద్రరావు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే అంతా ఆయనకు తెలిసే జరిగిందని DRI అధికారులు చెబుతున్నారు. సీబీఐ , ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
‘డీఆర్ఐ ప్రక్రియ మొత్తం చట్టప్రకారం జరిగింది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:30 గంటలకు ముగిసింది.’ తరువాత సమన్లు జారీ చేయబడ్డాయి. దర్యాప్తుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందింది. దుబాయ్‌లో బంగారం కొనడానికి అవసరమైన డబ్బును హవాలా ద్వారా పంపేవారు. నిందితురాలు స్వయంగా దీనిని అంగీకరించింది. జ్యుడీషియల్ విచారణ అనేది సెక్షన్ 108 కింద నోటీసు ఇవ్వడం ద్వారా జరిగే విచారణ. “ఇది పోలీసుల విచారణ కాదు” అని డిఆర్ఐ న్యాయవాది మధు రావు వాదించారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..