Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు..
హైదరాబాద్‌లో పాపులర్ స్టూడియోస్ అయిన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC షాక్ ఇచ్చింది. ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు రెండు స్టూడియోలకు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో పాపులర్ స్టూడియోస్ అయిన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC షాక్ ఇచ్చింది. ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు రెండు స్టూడియోలకు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టూడియోలు చూపించిన విస్తీర్ణం కంటే నిజానికి చాలా పెద్దవిగా ఉన్నట్లు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ ఏళ్లుగా తక్కువ ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
అన్నపూర్ణ స్టూడియోస్ లక్షా 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8100 చదరపు అడుగులు చూపిస్తున్నారు. ఇందుకు 11,52,000 చెల్లించాల్సి ఉండగా, రూ.49వేలు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రామానాయుడు స్టూడియోస్ 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1900 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు వీరు రూ.2,73,000 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.7,600 మాత్రమే చెల్లిస్తున్నారని.. అందుకే పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని హెచ్చరికలు జారీ చేస్తూ జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు ఈ రెండు సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
పన్ను ఎగవేతపై సీరియస్ గా స్పందించిన జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో బకాయి ఫీజులు చెల్లించాలని రెండు స్టూడియోలకు నోటీసులు పంపించినట్లు సమాచారం. స్టూడియోల నుంచి పూర్తి వివరణతోపాటు.. అసలైన విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని బల్దియా సూచించింది.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..




