Actor : 22 ఏళ్ల చిన్న హీరోయిన్‌తో 64 ఏళ్ల సూపర్ స్టార్ క్లోజ్ సీన్స్.. చివరకు క్షమాపణ చెప్పిన హీరో..
ప్రస్తుతం సీనియర్స్ కుర్రహీరోలకు గట్టిపోటీనిస్తున్న సంగతి తెలిసిందే. తమకంటూ చాలా సంవత్సరాలు చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే 64 ఏళ్ల ఓ సూపర్ స్టార్ 22 సంవత్సరాలు చిన్న హీరోయిన్ తో కలిసి నటించాడు. ఆ తర్వాత అతడు క్షమాపణ కూడా చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సాధారణంగా నటీనటులు అంటే అన్ని సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తమకంటే చిన్న హీరోయిన్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ సినిమాలో 64 ఏళ్ల సూపర్ స్టార్ తనకంటే 22 ఏళ్లు చిన్న హీరోయిన్ తో కలిసి నటించారు. వారిద్దరి మధ్యలో క్లోజ్ సీన్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సీన్స్ చిత్రీకరణ అనంతరం.. ఆ హీరో నటికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పారట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన నటించిన ‘తన్మతర’ విడుదలై 20 సంవత్సరాలు అయింది. గతంలో మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇది.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
ఇందులో మీరా వాసుదేవన్ మోహన్ లాల్ తో కలిసి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని ఒక సన్నివేశం ఇప్పటికీ వార్తల్లో ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మీరా మాట్లాడుతూ.. ఈ సినిమాలో మోహన్ లాల్ రమేశ్ నాయర్ అనే పాత్రలో నటించారని.. అతడు అల్జీమర్స్ తో బాధపడే వ్యక్తిగా కనిపించాడని తెలిపింది. అయితే ఒక సందర్భంలో హీరోహీరోయిన్ సన్నిహిత సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చిందని.. ఆ సన్నివేశం తర్వాత అతడు తనకు చేతులెత్తి క్షమాపణ చెప్పాడని గుర్తుచేసుకుంది.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఉత్తమ మలయాళీ సినిమాగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రానికి మోహన్ లాల్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు.ఇప్పటికీ బ్యాక్ టూబ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు మోహన్ లాల్.

Mohan Lal, Meera Vasudevan
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..




