Pushpa 2: గంగమ్మ తల్లి జాతర వీడియో సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే.. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూశారా..?
డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సత్తా చాటుతుంది. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అయిన సీన్ గంగమ్మ తల్లి జాతర. తాజాగా ఈ పాట వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోన్న మూవీ పుష్ప 2. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ ప్రేక్షకులను ఊర్రుతలూగించాయి. అటు నార్త్.. ఇటు నార్త్ ప్రేక్షకులను మెప్పించి థియేటర్లలో దూసుకుపోతుంది ఈ చిత్రం. త్వరలోనే ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ సైతం బ్రేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్, సన్నివేశాలు, మ్యూజిక్ ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ హైలెట్ అయ్యింది.
కేవలం ఈ ఎపిసోడ్ కోసమే సినిమాకు మళ్లీ మళ్లీ వెళ్లినవాళ్లు కూడా ఉన్నారు. ఇందులో అల్లు అర్జున్ ఉగ్రరూపం చూసి అడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా గంగమ్మ తల్లి జాతర వీడియో పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అల్లు అర్జున్ గంగమ్మ తల్లి గెటప్ లో డ్యాన్స్ చేసిన వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అఏవుతుంది. ఈ పాటను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేయగా.. యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
గంగమ్మ తల్లి వేషాధారణలో అల్లు అర్జున్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ ఒక్క ఎపిసోడ్ లో బన్నీ యాక్టింగ్ నేషనల్ స్థాయికి చేరుకుంది. ఈ పాటకు చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించగా.. మహాలింగం ఆలపించారు. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.