AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.. ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు.. ఎవరో తెలుసా..?

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె రిచ్చెస్ట్ హీరోయిన్. ఆ బ్యూటీ ఆస్తులు ఏకంగా రూ.4600 కోట్లు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అగ్రకథానాయికగా దూసుకుపోయింది. అలాగే అప్పట్లో ఆమె అందం, అభినయంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు సినీరంగంలో అత్యధిక ధనిక నటిగా గుర్తింపు సంపాదించుకుంది.

Tollywood: ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్.. ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు.. ఎవరో తెలుసా..?
Juhi Chawla
Rajitha Chanti
|

Updated on: Jan 03, 2025 | 4:14 PM

Share

సాధారణంగా సినీరంగంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. హీరోలకు ఒక్క సినిమా హిట్టు అయితే పారితోషికం అమాంతం పెరిగిపోతుంది. కానీ హీరోయిన్లకు ఎన్ని హిట్ మూవీస్ చేసినప్పటికీ హీరో రేంజ్ రెమ్యునరేషన్ రాదు. అంతేకాకుండా కొన్నాళ్లపాటే వారికి స్టార్ స్టేటస్, క్రేజ్ కొనసాగుతుంది. పెళ్లి తర్వాత హీరోయిన్లకు సినిమా ఆఫర్స్ తగ్గిపోతాయి. కొంతమంది సహయ నటిగా మెప్పిస్తుంటారు. అందుకే.. కథానాయికలు తమ క్రేజ్ ఉన్నప్పుడే భారీగా పారితోషికం తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాగే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు. అమితాబ్ బచ్చన్, షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల కంటే అత్యధిక ఆస్తులు సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? తనే బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా.

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. హిందీలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్, కాజోల్ వంటి కథానాయికలతో కలిసి పనిచేసింది. అప్పట్లో ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలోనే స్టార్ స్టేటస్ అందుకున్న జూహీ చావ్లా.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇదిలా ఉంటే.. మన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే హురున్ ఇండియా సంస్థ గతేడాదికు గానూ విడుదల చేసిన జాబితాలో సినిమా హీరోయిన్లలో జూహి చావ్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ఆస్తులు రూ.4600 కోట్లు. ఇక ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ ఆస్తులు రూ.7300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. హీరోయిన్లలో జూహి చావ్లా ఉంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్ (2000), నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్ (1200) కోట్లతో ఉన్నారు.

జూహి చావ్లా సినిమాలే కాకుండా ప్రకటనల ద్వారా భారీగా సంపాదించింది. అలాగే ప్రొడక్షన్ రంగంలో షారుఖ్ ఖాన్ పార్టనర్ ఆమె. డ్రీమ్స్ అన్ లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో జూహి చావ్లా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా షారుఖ్ కొనుగోలు చేసిన ఐపీఎల్ టీమ్ కోల్ కతా నైట్ రైడర్స్ లో ఆమె పార్టనర్ గా ఉంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.