AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: థియేటర్లలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్.. క్లారిటీ ఇచ్చిన గేమ్ ఛేంజర్ టీమ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (జనవరి 10) అర్ధరాత్రి నుంచే చాలా చోట్ల గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ పడ్డాయి. విడుదలైన అన్ని చోట్లా రామ్ చరణ్ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

Game Changer: థియేటర్లలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్.. క్లారిటీ ఇచ్చిన గేమ్ ఛేంజర్ టీమ్
Game Changer
Basha Shek
|

Updated on: Jan 10, 2025 | 10:05 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యస్ .జె. సూర్య, సునీల్, శ్రీకాంత్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం (జనవరి 10) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో చిన్న మార్పు చేసినట్లు గే్ ఛేంజర్ టీమ్‌ వెల్లడించింది. సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న మెలోడీ సాంగ్ ‘నానా హైరానా’ ను తొలగించినట్లు తెలిపింది. జనవరి 14 నుంచి ఈ పాట అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కాగా సినిమా రిలీజ్ కుముందే నానా హైరానా సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ విజువల్స్, కియారా అందం, రామ్ చరణ్ గ్రేస్ తో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సుమారు రూ. 10 కోట్ల ఖర్చుతో ఈ పాటను తెరకెక్కించారు. న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు దీని షూటింగ్‌ జరిగింది. తమన్‌ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యంసంగీతాభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈ గీతాన్ని కార్తిక్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు.

ఇలా ఎన్నో విశేషాలున్న నానా హైరానా సాంగ్ థియేటర్లలో చూడాలని చాలామంది ఆశపడ్డారు. కానీ గేమ్ ఛేంజర్ సినిమా కోసం థియేటర్లకు వెళ్లిన జనాలకు ఈ సాంగ్ అసలు కనిపించలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనిపై గేమ్ ఛేంజర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నట్లు టీమ్‌ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

‘అందరికీ ఇష్టమైన ‘నానా హైరానా’ పాట ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజ్‌ల ప్రాసెసింగ్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా ప్రస్తుతం దీన్ని ప్రదర్శించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం. జనవరి 14 నుంచి ఈ పాటను సినిమాలో జోడిస్తాం. దీనికోసం మా టీమ్‌ అంతా రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తోంది’ అని గేమ్ ఛేంజర్ టీమ్ తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..