AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ప్రేమించినోడి చేతిలో మోసపోయి.. పాపం చిన్న వయసులోనే.. శోభన్ బాబు చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందిన కొందరు హీరోలు హీరోయిన్లు చాలా చిన్న వయసులోనే ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. వివిధ కారణాలతో మృత్యు ఒడికి చేరారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

Actress: ప్రేమించినోడి చేతిలో మోసపోయి.. పాపం చిన్న వయసులోనే.. శోభన్ బాబు చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?
Actress Chandrakala
Basha Shek
|

Updated on: May 20, 2026 | 7:20 PM

Share

చంద్రకళ.. ఇప్పటి తరానికి ఈ నటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఓ నాలుగైదు దశాబ్దాల కిందకు వెళితే ఈవిడ తెలుగులో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా చేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసిందీ అందాల తార. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ‘సతి సుకన్య’ అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండో సినిమాకే ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి దిగ్గజాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆడపడుచు అనే సినిమాలో ఈ స్టార్ హీరోలిద్దరికీ చెల్లెలిగా నటించి మెప్పించింది. వీటితో పాటు ఆత్మీయులు, తల్లా? పెళ్లామా?, దసరా బుల్లోడు, పుట్టినిల్లు మెట్టినిల్లు, నోము, చక్రవాకం, కోడె నాగు, కురక్షేత్రం తదితర సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది చంద్రకళ. కాగా హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ అందాల తార ఎక్కువగా చెల్లెలి పాత్రలే పోషించింది. ఈమె నటనను చూసి సీనియర్ ఎన్టీఆర్ సైతం తన సినిమాల్లో ఛాన్స్ లు ఇప్పించాడట. ఇక శోభన్ బాబుతో కలిసి చాలా సినిమాల్లో చంద్రకళ చెల్లెలిగా నటించింది. అప్పట్లో శోభన్ బాబు, చంద్రకళ లది మంచి అన్నా, చెల్లెల్ల బంధం అనే వారట.

అయితే సినిమా కెరీర్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే చంద్రకళ ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీని వదిలి పెట్టి విదేశాలకు వెళ్లిపోయింది. అయితే భర్తతో మనస్పర్థలు రావడంతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. మళ్లీ సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. అయితే ఈ అందాల తార కేవలం 48 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఏఎన్నార్ హీరోగా నటించిన దసరా బుల్లోడులో చంద్రకళ నిర్మల అనే ఓ కీలక పాత్రలో నటించింది. ఇందులో ఆమె క్యాన్సర్ తో పేషెంట్ గా నటించింది. అయితే రియల్ లైఫ్ లోనూ చంద్రకళను కబళించింది క్యాన్సర్. దసరా బుల్లోడు సినిమా రిలీజైన ఏడేళ్లకు క్యాన్సర్ మహమ్మారితో కన్నుమూసిందీ చంద్రకళ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us