AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Posani Krishna Murali: బాలయ్య ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే… అసలు విషయం చెప్పిన పోసాని

హీరో నందమూరి బాలకృష్ణ- బి. గోపాల్ కాంబినేషన్ లో సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు వచ్చాయి. అయితే ఇదే కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన పలనాటి బ్రహ్మానాయుడు సినిమా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

Posani Krishna Murali: బాలయ్య 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే... అసలు విషయం చెప్పిన పోసాని
Posani Krishna Murali
Basha Shek
|

Updated on: Jul 27, 2026 | 5:10 PM

Share

రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని కృష్ణ మురళి. సుమారు 150కి పైగా చిత్రాలకు పనిచేసిన ఆయన రాజకీయాల్లోకి చేరి ఇండస్ట్రీకి దూరమైపోయారు. మళ్లీ ఇప్పుడు ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు పోసాని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా పోసాని రైటర్ గానే సినిమా కెరీర్ ఆరంభించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారాయన. అయితే ఆయన కథతోనే తెరకెక్కిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. అంతేకాదు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లాజిక్ కు దూరంగా ఉన్నాయి. అందుకే ఇప్పటికీ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటుంది తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పోసానికి ఇదే సినిమాపై ప్రశ్న ఎదురైంది.. ‘మీరు కథ అందించిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఫ్లాప్ కావడంతో పాటు, అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఓ సక్సెస్ ఫుల్ రైటర్ గా గుర్తింపు ఉన్న మీరు అలాంటి సన్నివేశాలు ఎందుకు రాశారు’? అన్న యాంకర్ ప్రశ్నకు పోసాని ఇలా స్పందించారు.

‘బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాకు కథను నేను అందించాను. మొదట బి. గోపాల్ గారు, బాలకృష్ణ గారు కథ విని నచ్చడంతోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. గోపాల్ గారికి కథ నచ్చకపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. అసలు నచ్చని కథతో ఆయన సినిమా చేయరు. కథ నచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే ఆ తర్వాతి పనులను పరుచూరి బ్రదర్స్ నిర్వహించారు. ఒక సినిమా హిట్ అయితే కథ నేను ఇచ్చానని చెప్పుకుని, ఫ్లాప్ అయితే కథలో చాలా మార్పులు చేశారని చెప్పడం నాకు నచ్చదు. ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ ఒక చెత్త కథ. ఆ సినిమా ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యత నాదే అని నేను ఒప్పుకుంటున్నాను’ అని పోసాని చెప్పుకొచ్చారు.

కాగా పల్నాటి యుద్ధం నేపథ్యంతో బ్రహ్మనాయుడు, నాగమ్మల పాత్రలను ఆధారంగా చేసుకుని బి. గోపాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాకు సంబంధించి పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us