హీరోయిన్ అవకాశాలు రిజెక్ట్ చేసింది.. బుల్లితెరపై క్రేజీ యాంకర్..
Rajitha Chanti
Pic credit - Instagram
31 August 2026
బుల్లితెర 'జబర్దస్త్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వచ్చిన అవకాశాలను తిరస్కరించడానికి గల కారణాలను వెల్లడించింది.
వెండితెరపై మెయిన్ లీడ్స్ ,స్పెషల్ సాంగ్స్ అవకాశాలు వచ్చినప్పటికీ, వాటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా వివరించింది వర్ష.
వర్ష తెలిపిన వివరాల ప్రకారం, జబర్దస్త్ , ఇతర టీవీ షోల డేట్స్ చాలా ముందే ఖరారవుతాయి. దీనివల్ల సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌తో డేట్స్ సర్దుబాటు కావడం కష్టంగా మారింది.
ప్రస్తుతం టీవీ మాధ్యమం ద్వారా లభిస్తున్న గుర్తింపు, ఇక్కడ సాధించిన పేరును డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేకే సినిమాలను రిజెక్ట్ చేశానని స్పష్టం చేసింది.
కొన్నాళ్ల పాటు టీవీలోనే కొనసాగి, ఆ తర్వాతే సినిమాల గురించి తీవ్రంగా ఆలోచిస్తానని పేర్కొంది. షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ కొన్ని విషయాలు చెప్పింది.
ఒక సంక్రాంతి ఈవెంట్ సమయంలో ఎదురైన తీవ్రమైన ఆరోగ్య సమస్యను వర్ష గుర్తు చేసుకుంది. రోజంతా ఎండలో పనిచేయడం వల్ల అస్వస్థతకు గురై స్పృహ తప్పిపోయే స్థితికి చేరుకోగా,
వెంటనే మల్లెమాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించింది. తిరిగి సెట్‌కు వచ్చిన వెంటనే, మరొక నటి (పూర్ణ) ఆరోగ్యం క్షీణించడంతో
ఆమె స్థానంలో కేవలం 10 నిమిషాల ప్రాక్టీస్‌తో "నా స్వామి" పాటకు డ్యాన్స్ చేసి తన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకుంది జబర్దస్త్ వర్ష చెప్పుకొచ్చింది.