వరలక్ష్మీ వ్రతంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మద.. ఫోటోస్ వైరల్..
Rajitha Chanti
Pic credit - Instagram
30 August 2026
బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ద్వారా నర్మద పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అన్షు రెడ్డి.
తన సహజసిద్ధమైన నటనా శైలితో, పక్కింటి అమ్మాయి లాంటి ఇమేజ్‌తో బుల్లితెర ప్రేక్షకులలో అపారమైన అభిమానాన్ని సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ, తాజాగా జరుపుకున్న వరలక్ష్మీ వ్రతం వేడుకల అందమైన ఫోటోలను పంచుకుంది.
శ్రావణ మాసం సందర్భంగా ఇళ్లల్లో లక్ష్మీదేవి పూజలు వెల్లివిరిసే వేళ, అన్షు రెడ్డి కూడా తన ఇంట్లో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంది.
ఈ సందర్భంగా ఆమె కట్టుకున్న సాంప్రదాయక పట్టు చీర, దానికి తగినట్లుగా ధరించిన బంగారు ఆభరణాలు ఆమెకు మరింత శోభను తెచ్చిపెట్టాయి.
పూజా గదిని పూలతో, కలశంతో ఎంతో భక్తిభావంతో అలంకరించి పూజలో పాల్గొన్న దృశ్యాలను అన్షు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.
ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది సమయానికే నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అన్షురెడ్డి రూపం మరియు ఆమె పద్ధతిపై అభిమానులు కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.