AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పైసీగా, క్రిస్పీగా మటన్ లివర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా చేసి చూడండి! మళ్లీ మళ్లీ కావాలంటారు

మటన్ లివర్ ఫ్రై రుచిగా, సులభంగా ఎలా తయారు చేయాలో ఈ రెసిపీలో తెలుసుకోండి. ఇంట్లో మళ్ళీ మళ్ళీ చేయమని అడిగేంత రుచిగా ఉండే ఈ వంటకానికి ప్రత్యేకమైన మసాలా పొడిని వాడతాము. లివర్ ముక్కలు పర్ఫెక్ట్‌గా వేయించే చిట్కాలతో కూడిన ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. ఇది స్నాక్‌గా లేదా స్టార్టర్‌గా చాలా బాగుంటుంది..

Srilakshmi C
|

Updated on: Aug 31, 2026 | 8:50 PM

Share
మటన్ లివర్ ఫ్రై చాలా మందికి ఇష్టమైన స్టార్టర్, సైడ్ డిష్. ఈ వంటకాన్ని ఇంట్లో సులభంగా, రుచికరంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన పద్ధతిలో, ప్రత్యేకమైన మసాలా పొడితో ఈ ఫ్రై చేస్తే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారు.

1 / 6
కావాల్సిన పదార్థాలు.. మటన్ లివర్: 1/2 కిలో (మరీ పెద్దవి కాకుండా మధ్యస్థ పరిమాణంలో ముక్కలు), ఆయిల్: 3-4 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు: 3 (పొడవుగా కట్ చేసినవి), ఉల్లిపాయలు: 2 మీడియం సైజు (పొడవుగా కట్ చేసినవి), టమాటా: 1 మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 1/2 టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: 1/2 టీస్పూన్, కరివేపాకు: 2 రెమ్మలు, కారం: 1 1/2 టీస్పూన్ (లేదా రుచికి సరిపడా), కొత్తిమీర: సన్నగా తరిగినది (గార్నిష్ కోసం), నిమ్మరసం: కొద్దిగా (సర్వ్ చేసేటప్పుడు), లవంగాలు: 4-5, యాలకులు: 3, దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క, జీలకర్ర: 1/2 టీస్పూన్, ధనియాలు: 1 టేబుల్ స్పూన్, మిరియాలు: 1/2 టీస్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు: 1 టేబుల్ స్పూన్, గసగసాలు: 1 టీస్పూన్ చొప్పున తీసుకోవాలి.

2 / 6
ముందుగా 1/2 కిలో మటన్ లివర్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాన్‌ను స్టవ్ పైన పెట్టి 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఈ ఫ్రైకి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కాక, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు శుభ్రం చేసిన లివర్ ముక్కలను కూడా వేసి, అన్నిటినీ కలిపి మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. లివర్ ముక్కలు వేగేటప్పుడు దాని నుండి నీరు ఊరుతుంది. ఆ నీటితోనే ముక్కలు ఉడుకుతాయి. అదనంగా నీరు పోయాల్సిన అవసరం లేదు.

3 / 6
నీరు కొద్దిగా ఇంకి వేగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్‌ను లో టు మీడియం లో పెట్టి లివర్ ముక్కలు బాగా వేగేలా చూసుకోవాలి. లివర్ ముక్కలు సరిగ్గా వేగకపోతే కొద్దిగా నీచు వాసన వస్తుంది. నీరు మొత్తం ఇంకిపోయి, నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలి. ఈ ప్రక్రియకు సుమారు 20-25 నిమిషాలు పడుతుంది.

4 / 6
ఈలోపు మరో పాన్‌లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి తక్కువ మంటపై దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి. ఇవి దోరగా వేగాక, 1 టీస్పూన్ గసగసాలు వేసి మరికాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. గసగసాలు చివరగా వేయాలి, లేదంటే మాడిపోతాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి. లివర్ ముక్కలు నీళ్లు ఇంకిపోయి, నూనె పైకి తేలి, కొద్దిగా రంగు మారిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి.

5 / 6
ముక్కలు కొద్దిగా ఎర్రగా, క్రిస్పీగా మారే వరకు వేగనివ్వాలి. లివర్ ముక్కలు కావాల్సిన రంగు వచ్చాక, 1 1/2 టీస్పూన్ కారం (లేదా రుచికి సరిపడా) వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వెంటనే మనం ముందుగా తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువ సేపు వేయించకూడదు, లేదంటే అది మాడి చేదుగా మారుతుంది. మసాలా పొడి అంతా బాగా కలిసిన తర్వాత, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. వేడివేడి మటన్ లివర్ ఫ్రై పైన కొద్దిగా నిమ్మరసం పిండి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే రుచి అదుర్స్. అన్నంలోకి, చపాతీలోకి లేదా స్టార్టర్‌గా ఒట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇంట్లో ప్రయత్నించి చూడండి..

6 / 6
Follow Us