Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. త్వరలోనే ఎపిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషయన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

యువ నటుడు ఆనంద్ దేవరకొండ తన రాబోయే చిత్రం ఎపిక్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ ఎంపికతో మొదలుపెట్టి, తన దృష్టిలో ఎపిక్ అంటే ఏంటి.?, తనను ప్రభావితం చేసిన చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎపిక్ అనే పదం చాలా పవర్ఫుల్ అని, దానిని తమ సినిమా టైటిల్‌గా ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆనంద్ దేవరకొండ వివరించారు. ఈ చిత్రం ఎపిక్: ఆన్ అన్‌ఫినిష్డ్ స్టోరీ అలాగే మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ అనే క్యాప్షన్స్ కలిగి ఉందని, ఇది కథకు ఎంతగానో సరిపోతుందని ఆయన తెలిపారు. సాధారణంగా ఎపిక్ అనే పదాన్ని మనం చాలా అరుదుగా, అసాధారణమైన సందర్భాలలో మాత్రమే వాడతామని ఆనంద్ గుర్తు చేశారు. ఒక సినిమాను ఎపిక్ అని పిలవాలంటే, అది ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేయాలని ఆయన అన్నారు. మరి తనను ఒక ప్రేక్షకుడుగా ఏ సినిమాలు ఎపిక్ అనిపించాయి అని అడగగా, ఆయన కొన్ని చిత్రాలను ప్రస్తావించారు. ఒడిస్సీ వంటి చిత్రాలు భారీ స్థాయి కారణంగా ఎపిక్‌గా అనిపిస్తాయని, బాహుబలి వంటి చిత్రాలు పేరులోనే ఎపిక్ అనే అర్థాన్ని కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
అయితే, ఆయన వ్యక్తిగత ఎమోష్నల్ గా తాకిన ఒక సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆ సినిమా సత్యం సుందరం. ఈ సినిమాను తాను రెండు మూడుసార్లు చూశానని, ముఖ్యంగా అందులోని ఒక సైకిల్ సన్నివేశం దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. ఆ సన్నివేశం తనకు ఎంతో నచ్చిందని, అది కేవలం ఒక చిన్న సైకిల్ ఇచ్చిపుచ్చుకునే దృశ్యం కాదని, దాని వెనుక ఉన్న భావోద్వేగం, కృతజ్ఞతా భావం తనను ఎంతగానో కదిలించిందని అన్నారు. ఒక పాత సైకిల్‌ను ఇవ్వడం, దానిని ఎంతో కాలం గుర్తుంచుకోవడం వంటివి జీవితంలో మనం సాధించే గొప్ప విషయాల కంటే కూడా నిజమైన, ఎమోష్నలైన “ఎపిక్” క్షణాలని ఆనంద్ అన్నారు.
అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది
అలాగే ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో కృతజ్ఞతా భావం తగ్గుతున్న ఇలాంటి సమయంలో సత్యం సుందరం వంటి సినిమాలు ఒక చిన్న ప్రేరణను అందిస్తాయని అన్నారు. కొన్నిసార్లు సినిమాలు చూసిన తర్వాత, మనం మారినట్లు, ఏదో నేర్చుకున్నట్లు అనిపిస్తుందని, అది కేవలం నీతిపాఠం కాదని ఆయన వివరించారు. సత్యం సుందరం చూసిన తర్వాత తాను చిన్న విషయాలకు మరింత విలువ ఇవ్వాలని, చిన్న చిన్న క్షణాలను ఆస్వాదించాలని కోరుకున్నట్లు ఆనంద్ దేవరకొండ తెలిపారు. ఈ ప్రభావం కొన్ని రోజులు ఉండవచ్చు, ఆ తర్వాత మనం మళ్ళీ మన దైనందిన జీవితంలోకి వెళ్ళిపోతామని, కానీ అలాంటి సినిమాలు మనకు జీవితంలోని మరో కోణాన్ని చూపిస్తాయని, ప్రాక్టీస్‌తో మనం అలాంటి విలువలను నిలుపుకోవచ్చని ఆయన అన్నారు.
ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




