AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సూపర్‌స్టార్ కృష్ణ చేసిన సేవలు అపారమైనవి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సినీరంగానికి ఎనలేని మేలు చేశారు. పరిశ్రమ స్థాయిని పెంచిన నటులలో ఆయన ఒకరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన సినిమాలు పరిశ్రమ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడ్డాయి.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
Krishna
Rajeev Rayala
|

Updated on: Aug 31, 2026 | 7:25 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు, ఆయన విలక్షణమైన నటన, అసంఖ్యాకమైన ప్రయోగాలు, ధైర్యమైన నిర్ణయాలు మాత్రమే కాదు, ఆయన గొప్ప మనసు, తోటి నటుల పట్ల చూపిన అపారమైన గౌరవం కూడా గుర్తుకు వస్తాయి. ఆయన దశాబ్దాల పాటు మేకప్ మ్యాన్‌గా పనిచేసిన మాధవరావు, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని అరుదైన విషయాలను పంచుకున్నారు. కృష్ణ కేవలం ఒక స్టార్‌గా కాకుండా, ఒక మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా ఎలా నిలిచారో తెలిపారు. మాధవరావు వెల్లడించిన అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి, చిరంజీవి ఎదుగుదలలో కృష్ణ పాత్ర. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ లాంటి ఉద్ధండులు ఉన్న కాలంలో కృష్ణ యువ నటుడిగా వచ్చి ఒక ప్రభంజనం సృష్టించినట్టే, కృష్ణ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు చిరంజీవి యువ నటుడిగా రంగ ప్రవేశం చేశారు.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

“ఖైదీ” సినిమా కథ మొదట కృష్ణ వద్దకు వచ్చిందట. అయితే, కృష్ణ ఆ కథను విని, “నాకంటే చిరంజీవి ఈ పాత్రను మరింత అద్భుతంగా చేస్తాడు, అతన్ని పెట్టుకోండి” అని స్వయంగా సూచించారని మాధవరావు వివరించారు. కృష్ణ ఇచ్చిన ఈ సూచన చిరంజీవి కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా, తోటి నటుడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కృష్ణ గొప్ప మనసుకు నిదర్శనం.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

కృష్ణ ఔదార్యం చిరంజీవికి మాత్రమే పరిమితం కాలేదు. నటుడు కృష్ణంరాజు విషయాలలో కూడా ఆయన అండగా నిలిచారు. “కటకటాల రుద్రయ్య” కథ కృష్ణ వద్దకు వచ్చినప్పుడు, మాధవరావు ఎంతగానో పట్టుబట్టి ఆ సినిమా చేయమని కోరినా, కృష్ణ దాన్ని వదులుకొని కృష్ణంరాజును పెట్టుకోమని సూచించారట. అదేవిధంగా, “రోజులు మారాయి” అనే చిత్రం కూడా కృష్ణ వద్దకు రాగా, దానిని శోభన్ బాబుకు ఇవ్వమని చెప్పి, స్వయంగా ఆయనే చేయమని ప్రోత్సహించారు. ఈ సంఘటనలు కృష్ణ ఎంత గొప్ప వ్యక్తిత్వానికి, తోటి నటుల ఎదుగుదలను ఎంతగా కోరుకున్నారనడానికి నిదర్శనం.

ఇవి కూడా చదవండి

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే
సోమవారం రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎలా ఉందంటే..
సోమవారం రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎలా ఉందంటే..
ఫిలిప్స్ ఎస్7221 5జీ స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలివే
ఫిలిప్స్ ఎస్7221 5జీ స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలివే
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆప్షన్లు.. ఐదు వందల రేంజ్‌తో ఎమ్‌జీ 7 సీటర్​
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆప్షన్లు.. ఐదు వందల రేంజ్‌తో ఎమ్‌జీ 7 సీటర్​