16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు
భారతీయ చలనచిత్ర చరిత్రలో దేవిక ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. అందంలోనే కాదు, అభినయంలోనూ ఆమెకు ఆమే సాటి. తెలుగు సినిమా తొలి సౌండ్ ఫిల్మ్ నిర్మాత రఘుపతి వెంకయ్య నాయుడు గారి మనవరాలిగా దేవిక చలనచిత్ర వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆమె కుమార్తె కనక, ఒకప్పుడు తమిళ, మలయాళ చిత్రాల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొందారు

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. సినిమా రంగంలో స్టార్ గా రాణించిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఆమె మరెవరో కాదు ఆ హీరోయిన్ పేరు దేవికా. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే డైరెక్టర్ ఎ.బీమ్సింగ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దేవదాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవికా. వీరి కుమార్తె కనక. తమిళంలో నటిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత తెలుగులోనూ నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కనక. కరకట్టకరన్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.
ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే
సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఒకానొక సమయంలో చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేసింది. ఆమె రామరాజన్, రజిని, ప్రభు, కార్తీక్, విజయకాంత్, మమ్ముట్టి వంటి ప్రముఖ హీరోలతో నటించింది. చిన్నవయసులో కనక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 16 ఏళ్ల వయసులోనే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన కనక 26 ఏళ్లకే ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. చివరగా విరలుకట్ట ఉదమియా సినిమాలో కనిపించింది. అప్పుడు ఆమెకు 26 ఏళ్లు. ఈ సినిమా త్రవాత ఆమె మరో సినిమా చేయలేదు.
ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
1980ల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కనక.. ఇండస్ట్రీకి, నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అయితే కనక తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే విడాకులు తీసుకోవడంతో తల్లి దగ్గరే పెరిగింది కనక. ఆతర్వాత ఆమె తల్లి చనిపోయారు. ఆ తర్వాత 2007లో కాలిఫోర్నియాకు చెందిన ఓ ఇంజనీర్ ను కనక వివాహం చేసుకుందనే వార్తలు వచ్చాయి. అయితే 2010లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కనక.. పెళ్లైన 15 రోజులకు తన భర్త కనిపించకుండా పోయాడని తెలిపింది. ఆతర్వాత ఆమె పూర్తగా కనిపించకుండా పోయింది. బయట ప్రపంచానికి తెలియకుండా దూరంగా ఉంటున్నారు కనక.
10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




