AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను పిలవరు.. పిలిచిన వెళ్ళను..! ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్ విజయశాంతి

టాలీవుడ్ హీరోయిన్ విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ, సినీ రంగ ప్రస్థానం గురించి వివరంగా పంచుకున్నారు. ప్రజలకు నిరంతరం సేవ చేయడమే తన జీవిత ఆశయమని, 24 గంటలు పనిచేయడం తనకెంతో అలవాటని ఆమె స్పష్టం చేశారు. విజయశాంతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నన్ను పిలవరు.. పిలిచిన వెళ్ళను..! ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్ విజయశాంతి
Vijayashanthi
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 2:31 PM

Share

లేడీ అమితాబ్ గా పేరుగాంచిన ప్రముఖ నటి విజయశాంతి తన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె 80ల నాటి నటీనటుల రీయూనియన్ పార్టీ, తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, తన విజయాలకు కారణమైన వ్యక్తుల గురించి మాట్లాడారు. చిరంజీవి ఏర్పాటు చేసిన 80ల రీయూనియన్ పార్టీకి తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానించినా తాను వెళ్ళేదాన్ని కాదని విజయశాంతి స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే పార్టీలు, ఫంక్షన్లకు దూరంగా ఉండే స్వభావం తనదని ఆమె పేర్కొన్నారు. షూటింగ్, ఇల్లు అనే ప్రపంచంలోనే తాను జీవించానని, రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఉద్యమాలు, ఇల్లే తన ప్రాధాన్యత అని చెప్పారు. తన సినిమాల 100 రోజుల వేడుకలకు కూడా కేవలం అర గంట మాత్రమే హాజరై, షీల్డ్ తీసుకుని వెళ్లిపోతానని తెలిపారు. ఈ పార్టీల పట్ల తనకు ఆసక్తి లేదని, ఎప్పుడూ ఆహ్వానించినా తాను వెళ్ళేదాన్ని కాదని ఆమె వివరించారు.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

తన కెరీర్‌లో రౌడీ ఇన్‌స్పెక్టర్ సినిమా షూటింగ్‌ సమయంలో కర్నూలు జిల్లాలో ఎదురైన ఒక సంఘటనను విజయశాంతి గుర్తుచేసుకున్నారు. ఒక పాట చిత్రీకరణ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను చూడటానికి తరలిరావడంతో, నంద్యాల వద్ద రైలును నిలిపివేశారని చెప్పారు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న తాను, జనాలను చూసి భయపడ్డానని తెలిపారు. ఆ సమయంలో బాలకృష్ణ వచ్చి జనాలను నియంత్రించారని, తనను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారని ఆగుర్తుచేసుకున్నారు. రైలును దాదాపు గంటన్నర పాటు కదలనివ్వలేదని, పట్టాలపై కూడా ప్రజలు కిక్కిరిసిపోయారని ఆనాటి పరిస్థితిని వివరించారు.

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

తనను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన విజయనిర్మల గారిని ఆమె సదా గుర్తుంచుకుంటానని చెప్పారు. కృష్ణ గారితో నటిస్తున్నప్పుడు తాను చిన్నపిల్లలా ఉన్నానని, కృష్ణ గారు మొదట సంశయించినా, విజయనిర్మల గారు “నేను చూసుకుంటాను” అని ధైర్యం చెప్పారని తెలిపారు. దాసరి నారాయణ రావు, టి. కృష్ణ, భారతీరాజా వంటి వారిని తన జీవితంలో మర్చిపోలేనని, వారి వల్లే తన జీవితం మారిపోయిందని ఆమె అన్నారు. విశ్వనాథ్, యండమూరి, మోహన్ గాంధీ, కోదండరామిరెడ్డి వంటి దర్శకులు తనకు మంచి పాత్రలను అందించారని, వారిని కూడా గౌరవంగా స్మరించుకున్నారు.

ఇవి కూడా చదవండి

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us