AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

ప్రముఖ హాస్యనటుడు ప్రభాస్ శ్రీను తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కామెడీ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. నెగిటివ్ పాత్రలు చేస్తూనే కామెడీని కూడా పండించి ప్రేక్షకులను అలరించారు ప్రభాస్ శ్రీను. స్టార్ హీరోల సినిమాల్లో నటించారు ప్రభాస్ శ్రీను.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా
Prabhas Srinu
Rajeev Rayala
|

Updated on: Aug 29, 2026 | 3:19 PM

Share

ప్రభాస్, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, తన అభిమానుల, సన్నిహితుల పట్ల చూపించే అపారమైన ప్రేమ, ఆతిథ్యం వల్ల డార్లింగ్గా కూడా పేరు పొందారు. అయితే నటుడు ప్రభాస్ శ్రీను ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో తన సుదీర్ఘ అనుబంధం, ఆయన ఆతిథ్యం, సరదా కోరికలు, అలాగే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ ఆతిథ్యం గురించి మాట్లాడుతూ, “ఆయన మామూలుగా ఉండదో.. జంధ్యాల గారి సినిమాల్లో ఉంటాయి కదా, తింటావా తినవా అని. అలాగే ప్రభాస్ కూడా అంతే” అని ప్రభాస్ శ్రీను నవ్వుతూ చెప్పారు. ప్రభాస్‌తో ప్రతి రోజు ఒక కొత్త అనుభవమేనని, ఎన్నో సంఘటనలు ఉన్నాయని శ్రీను వెల్లడించారు. ముఖ్యంగా అడవి రాముడు సినిమా షూటింగ్ సమయంలో తలకోన అడవుల్లో జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే

ఆ సమయంలో ప్రభాస్ అడవిరాముడు కోసం చాలా కఠినమైన డైట్‌లో ఉన్నారని, ఆ డైట్ చూస్తే నాకే భయమేసేదని శ్రీను గుర్తు చేసుకున్నారు. తలకోనలో అటవీ ప్రాంతంలో షూటింగ్ జరగగా, గూడెం సెట్ నుంచి కొంత దూరంలో ప్రభాస్ బస చేసేందుకు ఏపీ టూరిజం గెస్ట్ హౌసుల్లో సీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో రూమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక రాత్రి 8:30 గంటల ప్రాంతంలో, మరుసటి రోజు షూటింగ్ రద్దయిందని చెప్పగానే, ప్రభాస్ ఆకస్మికంగా “ఇప్పుడు నేను నాటుకోడి తింటాను” అని కోరారని శ్రీను చెప్పారు. అది కూడా అడవి మధ్యలో, ఎటువంటి వసతులు లేని చోట, అర్థరాత్రి వేళ నాటుకోడి ఎలా తీసుకురావాలో తెలియక ప్రభాస్ శ్రీను తల పట్టుకున్నారట.

ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు

“నేను చూసింది భయంకరమైన డైట్, ఆ డైట్‌లో ఇప్పుడు నాటుకోడి తింటాను అంటే తేవాలి. ఆయన తినకపోతే మనకి మనసు బాగోదు” అని ప్రభాస్ పట్ల తనకున్న అభిమానాన్ని శ్రీను వ్యక్తం చేశారు. క్వాలిస్ వాహనం తీసుకుని, అడవిలోకి వెళ్లి, షూటింగ్ సెట్‌లోని గూడెం సెట్‌లో ఉన్న కొన్ని కోళ్లను టార్చిలైట్ సాయంతో పట్టుకుని వచ్చారు. రాత్రికి రాత్రే ఆ కోళ్లను వండి, నాటుకోడి, రసం కూడా చేసి ప్రభాస్‌కు వడ్డించారు. ఆ రోజు ప్రభాస్ ఎంతో ఆనందంగా ఉన్నారని, ఆ మహారాజు గారు హ్యాపీ ఫీల్ అయ్యారని శ్రీను వివరించారు. ప్రభాస్‌కు “వద్దు” అనడానికి లేదని, మనం తినాలనుకుంది “ఇక్కడ లేదు” అని ప్రభాస్ కు చెప్పకూడదు శ్రీనుగుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us