అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి. అందులో తన సినిమా ప్రస్థానం, చిత్రాల పట్ల తన ఆలోచనలపై కీలక విషయాలు వెల్లడించారు. అలాగే లిరిసిస్ట్ వేటూరి

ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శేఖర్ కమ్ముల, లెజెండరీ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తితో తనకున్న లోతైన అనుబంధాన్ని, అతని రచనలు తన చిత్రాలపై చూపిన ప్రభావాన్ని వివరించారు. శేఖర్ కమ్ముల తన సినిమాలలో సాంప్రదాయ, శాస్త్రీయ సాహిత్యానికి, సంగీతానికి ప్రాధాన్యత ఇస్తుంటారని తెలిపారు. హ్యాపీ డేస్ చిత్రంలో మిక్కీ జె. మేయర్ సంగీతం అందించినా, అందులో ఓ మెలోడీ టచ్ ఉండేలా చూసుకుంటానని, ఇది తన సినిమాల్లో ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. లీడర్ వంటి చిత్రాలలో జై జై జై ప్రియభారత వంటి పాత పాటలను, ఆనంద్ చిత్రంలో కీర్తనలను వాడతానని, ప్రేక్షకులు వాటిని బాగా స్వీకరిస్తారని తెలిపారు. మంచి పాటలను సరైన సందర్భంలో వాడితే అవి తప్పక ఆదరణ పొందుతాయని ఆయన అన్నారు.
ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా
వేటూరి సుందరరామమూర్తితో శేఖర్ కమ్ముల అనుబంధం ఆనంద్ చిత్రంతో ప్రారంభమైంది. ఆ సమయంలో వేటూరి ఆరోగ్యం సరిగా లేక, మంచానికే పరిమితమై, అనారోగ్య సమస్యల్లో ఉన్నారని శేఖర్ గుర్తు చేసుకున్నారు. కొత్త దర్శకుడిగా, వేటూరి లాంటి దిగ్గజాన్ని కలవడానికి భయపడినప్పటికీ, ఆయనను కలిసి ఆనంద్ కథను పూస గుచ్చినట్లు వివరించారు. వేటూరి శ్రద్ధగా కథ విని, దాన్ని వ్రాతపూర్వకంగా ఇవ్వమని కోరారట. వేటూరిని కలిసినప్పుడు, పాటకి ఎంత ఇద్దామని బయట చర్చించుకుని, అసిస్టెంట్‌తో మాట్లాడితే, లక్ష రూపాయలు అడుగుతారని, తమకు రూ.25,000 నుండి రూ.30,000 కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పినప్పుడు, వేటూరి సరేనని పాటలు రాయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. అలా, రెండు రోజులలోనే యమునా తీరం వంటి అద్భుతమైన పాటలతో సహా ఆనంద్ చిత్రంలోని అన్ని పాటలు రాసి ఇచ్చారని శేఖర్ కమ్ముల వెల్లడించారు.
అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
వేటూరి పనితీరును ప్రశంసిస్తూ, ఆయన ఎంత అనారోగ్యంతో ఉన్నా, అద్భుతమైన పాటలు రాయగలిగే అసాధారణ ప్రజ్ఞావంతుడని శేఖర్ కమ్ముల అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట కోసం లోతుగా అధ్యయనం చేసి, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని రాస్తే, వేటూరి వేగంగా, అనర్గళంగా, సందర్భానికి తగినట్లుగా రాయగలడని, ఆయనకు “పార్టిషన్డ్ బ్రెయిన్” ఉందని, ఎంత లోతైన సాహిత్యాన్నైనా, ఎంత సాధారణ సాహిత్యాన్నైనా రాయగల సత్తా ఆయన సొంతమని వివరించారు. వేటూరి మరణం తన చిత్రాల సృజనాత్మకతపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని శేఖర్ కమ్ముల భావోద్వేగానికి లోనయ్యారు.
16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




