AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక!

దేశ రాజధాని ఢిల్లీలో పేదల ఆరోగ్య హక్కును కాపాడటంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మైలురాయి లాంటి ఆదేశాలను జారీ చేసింది. సామాన్యులకు వైద్యం అందని ద్రాక్ష కావొద్దని గట్టిగా చెప్పిన న్యాయస్థానం.. ప్రభుత్వ రాయితీలు, తక్కువ ధరల భూములపై నిర్మించిన ప్రైవేట్ ఆసుపత్రులు పేద రోగులకు ఉచిత సేవలు అందించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి.. ప్రైవేట్ ఆసుపత్రులకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక!
Supreme Court Delhi hospitals
Gopikrishna Meka
| Edited By: |

Updated on: May 20, 2026 | 7:29 PM

Share

ఢిల్లీలో పేదల ఆరోగ్య హక్కును కాపాడటంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది..ప్రభుత్వ రాయితీలు, అనుకూల భూములపై నిర్మించిన ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని సుప్రీం కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో విఫలమవుతున్న ఆసుపత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది..నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు పొందిన ఆసుపత్రులు పేద రోగులకు 10% ఇన్‌పేషెంట్ (IPD) బెడ్స్ , 25% అవుట్‌పేషెంట్ (OPD) సేవలు పూర్తిగా ఉచితంగా అందించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందులో మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సలు, హాస్పిటల్ ఛార్జీలు అన్నీ ఉచితంగా ఉండాలని పేర్కొంది..మురికివాడల సమీపంలో ఆసుపత్రులు నిర్మించుకుని, పేదలకు వైద్యం అందించడంలో వెనకడుగు వేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సామాన్యులకు వైద్యం అందని ద్రాక్ష కావొద్దు అని కోర్టు గట్టిగా చెప్పింది.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న వందలాది ప్రైవేట్ ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఢిల్లీ ఆసుపత్రుల్లో ఏం జరిగిందంటే ?:

ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) వారికి ఉచిత చికిత్సను అమలు చేయడానికి ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది..గతంలో ధిక్కార నోటీసులు జారీ చేసిన 51 ఆసుపత్రులలో కేవలం 4 మాత్రమే నిబంధనలను పాటిస్తున్నాయని కోర్టు పేర్కొంది.రాయితీతో ప్రభుత్వ భూములపై ​​నిర్మించిన ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) రోగులకు ఉచిత చికిత్సను అందించాలని ఆదేశించిన తన 2018 తీర్పును సమర్థవంతంగా అమలు చేయడానికి, ఒక ప్రామాణిక కార్యాచరణ విధానం (SOP) రూపొందించడం కోసం ప్రభుత్వ అధికారులు, భూ యాజమాన్య సంస్థలు ప్రైవేట్ ఆసుపత్రులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అనేక ఆసుపత్రులు నిబంధనల పాటింపు అఫిడవిట్లను దాఖలు చేయడంలో విఫలమయ్యాయని, బలహీన వర్గాల రోగులకు 10% IPD (ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ – ఇక్కడ రోగిని 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆసుపత్రిలో చేర్చుతారు), 25% OPD చికిత్సను ఉచితంగా అందించాలనే నిబంధనను ఉల్లంఘించినట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనల పాటించడం పై ఒక నివేదికను సిద్ధం చేయడానికి న్యాయస్థానం గతంలో సీనియర్ న్యాయవాది సంజయ్ జైన్ న్యాయవాది నినాద్ లాడ్‌లను అమీసీ క్యూరీలుగా నియమించింది. బలహీన వర్గాల ప్రజలకు (EWS) ఉచిత చికిత్స అందించాలన్న న్యాయస్థానం యొక్క 2018 తీర్పును ఉల్లంఘించినందుకు ధిక్కార నోటీసులు జారీ చేయబడిన 51 ఆసుపత్రులతో పాటు, అమికస్ క్యూరీ మే 10, 2026న సుప్రీంకోర్టు కు ఒక నివేదికను సమర్పించారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ , DDA అధీకృత కాలనీల వద్ద మురికివాడలు, బస్తీల వద్ద ఆసుపత్రులలో చికిత్స పొందడానికి వెళ్ళే వారి డేటా ఆధారంగా నివేదిక రూపొందించారు.

సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిన ఆసుపత్రులు:

సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లు తేలిన 51 ఆసుపత్రులలో, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రైమస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వెంకటేశ్వర్ హాస్పిటల్, విమ్హాన్స్ హాస్పిటల్ మూల్‌చంద్ హాస్పిటల్ అనే ఆరు ఆసుపత్రులు మినహా, మిగిలినవన్నీ నిబంధనల పాటింపు అఫిడవిట్‌ను దాఖలు చేశాయి. 51 ఆసుపత్రులలో, అమర్ జ్యోతి ఆసుపత్రి, భగవతి ఆసుపత్రి, వేణు ఐ ఇన్‌స్టిట్యూట్, జివోదయ ఆసుపత్రి అనే నాలుగు ఆసుపత్రులు మాత్రమే కోర్టు తీర్పును పాటించినట్లు తేలింది. అమికస్ క్యూరీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఉచిత చికిత్స ఆదేశాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సమన్వయంతో కూడిన సంస్థాగత చర్య అవసరమని పేర్కొంది..దీనికోసం పలు అధికార వర్గాలు, భాగస్వాములతో ఒక సంయుక్త సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మే 23 ఢిల్లీ సచివాలయంలో కీలక సమావేశం:

అమికస్ క్యూరిటీతో సంప్రదించి, మే 23, 2026న సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ సచివాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని , జీఎన్‌సీటీడీ నర్సింగ్ హోమ్ సూపరింటెండెంట్, ఈడబ్ల్యూఎస్ ఇన్‌చార్జ్ అయిన డాక్టర్ కుసుమ్ అరోరాను కోర్టు ఆదేశించింది.ఈ సమావేశంలో న్యాయవాదులు సంజయ్ జైన్,నినాద్ లాడ్ పాల్గొంటారు..సూపరింటెండెంట్ నర్సింగ్ హోమ్ EWS (ఆర్థికంగా బలహీన వర్గం) ఇన్‌చార్జ్, GNCTD.బి. డాక్టర్ కుసుమ్ అరోరా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

నోటీసు అందుకున్న ఆసుపత్రులు, వారి మెడికల్ సూపరింటెండెంట్ లు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (MoHFW), GNCTD కార్యదర్శి., కేంద్ర ల్యాండ్ డెవలప్మెంట్ అధికారి,భూమి యాజమాన్య సంస్థల నుండి సీనియర్ అధికారులు,ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ , ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ నుండి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి డైరెక్టర్ స్థాయి అధికారి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ సమావేశంలో పాల్గొంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us