AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌ ట్రై చేశారంటే హాయిగా, కూల్‌ కూల్‌గా ఉండొచ్చు!

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు వేసినా వేడి తగ్గదు. వీటన్నింటికీ మించి మధ్యాహ్నం వేళల్లో బాత్‌రూమ్‌లో నల్లా తిప్పితే వచ్చే కడు వేడి నీరు షాకిస్తోంది. మిద్దెపై నేరుగా ఎండ తగిలేలా ఉండే ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు హీట్ ఎక్కడం వల్లే ఈ సమస్య వస్తుంది. అయితే, దీనికి ఒక ఉపాయం ఉంది.. మనకు ఈజీగా లభించే ఒక వస్తువుతో ట్యాంకు నీటిని ఫ్రిజ్‌లో నీళ్లలా చల్లగా ఉంచుకునే సరికొత్త దేశీ జుగాడ్ (Desi Jugaad) ఒకటి ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అదే అల్యూమినియం ఫాయిల్ ట్రిక్. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌ ట్రై చేశారంటే హాయిగా, కూల్‌ కూల్‌గా ఉండొచ్చు!
How To Keep Water Tank Cool
Jyothi Gadda
|

Updated on: May 20, 2026 | 6:57 PM

Share

బాబోయ్ ఈ సమ్మర్‌ సుర్రుమంటోంది. ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు రెస్ట్‌ లేకుండా పరిగెడుతున్నాయి. ఇక మిద్దెపై ఉండే ప్లాస్టిక్ నీటి ట్యాంకులు ఎండ వేడికి కరిగిపోయేలా తయారై, గీజర్‌లా వేడి నీటిని ఇస్తుంటాయి. దీంతో ప్రజలు మరింత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే, దీనికి ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. అది అల్యూమినియం ఫాయిల్ హ్యాక్ (Aluminium Foil Hack). ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అవును, మనం కిచెన్‌లో ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి ఉపయోగించే ఈ మెరిసే పేపర్‌కు సూర్యకిరణాలను ప్రతిబింబించే (Reflect) గుణం ఉంది. ట్యాంకుకు పాత కాటన్ గుడ్డ లేదా జూట్ బస్తాను చుట్టి, దానిపై అల్యూమినియం ఫాయిల్‌ను మెరిసే వైపు బయటకు ఉండేలా కప్పడం ద్వారా 90 శాతానికి పైగా ఎండను నిరోధించవచ్చు. దీనివల్ల ట్యాంకు దెబ్బతినకుండా ఉండటమే కాకుండా వేసవిలోనూ నీరు చల్లగా ఉంటుంది.

అల్యూమినియం ఫాయిల్ ఎలా పనిచేస్తుంది? :

సాధారణంగా మనం వంటగదిలో చపాతీలు, ఇతర ఆహార పదార్థాలు వేడిగా ఉండటానికి సిల్వర్ రంగులో మెరిసే అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను వాడుతుంటాం. ఈ పేపర్‌కు అద్భుతమైన రిఫ్లెక్టివ్ (సూర్యకాంతిని వెనక్కి పంపే) గుణం ఉంది. దీనిపై తీవ్రమైన సూర్యకిరణాలు పడినప్పుడు, ఇది ఆ వేడిని గ్రహించకుండా 90శాతం కంటే ఎక్కువ ఎండను తిరిగి ఆకాశంలోకి పరావర్తనం (Reflect) చేస్తుంది. ఫలితంగా ట్యాంక్ ప్లాస్టిక్ పొర వేడెక్కదు.

ఇవి కూడా చదవండి
Water Tank Cooling Tips

Water Tank Cooling Tips

ఎలా ఉపయోగించాలి?:

మొదటి పొర (ఇన్సులేషన్): అల్యూమినియం ఫాయిల్‌ను నేరుగా ట్యాంకుపై చుడితే అది గాలికి చినిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల మొదట ట్యాంకు చుట్టూ ఏదైనా పాత కాటన్ బెడ్‌షీట్, కాటన్ చీర లేదా జనపనార (Jute) బస్తాలను గట్టిగా చుట్టాలి. ఇది బయటి వేడి నేరుగా ప్లాస్టిక్‌కు తగలకుండా ఆపుతుంది.

రెండో పొర (ఫాయిల్ పేపర్): ఇప్పుడు ఆ బస్తా లేదా గుడ్డపై అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను చుట్టాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫాయిల్ పేపర్‌లో ఎక్కువ మెరిసే భాగాన్ని (Shiny Side) బయటి వైపుకు ఉంచాలి. ట్యాంక్ పైభాగం (మూత) నుండి కిందటి వరకు దీనిని పూర్తిగా కవర్ చేసి దారంతో లేదా టేపుతో కట్టేయాలి.

ఇతర ప్రయోజనాలు:

ఈ చిన్న చిట్కా వల్ల కేవలం నీరు చల్లగా ఉండటమే కాకుండా, ఎండ తీవ్రతకు ప్లాస్టిక్ ట్యాంకులు పాడైపోకుండా, పగుళ్లు రాకుండా దీర్ఘకాలం మన్నుతాయి. అలాగే ట్యాంకు లోపల నాచు (Algae) పట్టకుండా ఉంటుంది. వేసవి తాపానికి భారీ ఖర్చుతో కూడిన కూలింగ్ షెడ్లు వేయలేని వారికి ఈ సింపుల్ హోమ్ హ్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత