మృణాల్ తన కెరీర్‌ను 'ముజ్సే కుచ్ కెహ్తీ... యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది.
'కుంకుమ్ భాగ్య' సీరియల్‌లో 'బుల్బుల్' పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయం అయ్యింది.
2014లో 'విట్టి దండు' తో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత హృతిక్ రోషన్‌తో 'సూపర్ 30', జాన్ అబ్రహంతో బాట్లా హౌస్, షాహిద్ కపూర్‌తో జెర్సీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
2022లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం' సినిమాతో మృణాల్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ , ప్రభాస్ నటించిన కల్కి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది మృణాల్.
ఇటీవలే డెకాయిట్ సినిమాతో మరో హిట్ అందుకుంది. కాగా ఈ చిన్నది త్వరలోనే తమిళ్ లోనూ అడుగుపెడుతుందని టాక్.
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎమోషన్స్ పండించే బలమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది మృణాల్ ఠాకూర్