Chandramukhi 2: ఆకట్టుకుంటున్న’చంద్రముఖి 2′ ఫస్టు సింగిల్ ప్రోమో.. మ్యూజిక్‌తో ఆసక్తి పెంచేసిన..
అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రానికి మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, లారెన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా.. జ్యోతిక టైటిల్ రోల్ పోషించింది. అలాగే నాజర్, వడివేలు, రఘు కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రానికి మరోసారి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, లారెన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పూర్తి పాటను రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. చంద్రముఖి సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్ని సమకూర్చగా ..ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన కంగనా లుక్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
View this post on Instagram
అలాగే ఈ జోనర్ చిత్రాల్లో నటించి అలరించిన అనుభవం లారెన్స్ కు అనుభవం ఉంది. అయితే మొదటిసారి సూపర్ హిట్ సీక్వెల్ లో లారెన్స్ నటిస్తుండడంపై ఈ మూవీపై మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఈనెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిజానికి వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. టెక్నికల్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు మరికొద్ది రోజుల్లో చంద్రముఖి 2 విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.