Vijay Sethupathi: దటీజ్ మక్కల్ సెల్వన్.. ’96’ సినిమాకు విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాకవుతారు..
2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఇందులో త్రిష పోషించిన జాను పాత్రతో మరోసారి ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. ఈ చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఇక ఇందులోని సాంగ్స్ సైతం నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. ఇందులో నటించినందుకు విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నిజంగా మీరు షాకవుతారు.

సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న చిత్రాల్లో 96 ఒకటి. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఇందులో త్రిష పోషించిన జాను పాత్రతో మరోసారి ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. ఈ చిత్రం యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఇక ఇందులోని సాంగ్స్ సైతం నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. ఇందులో నటించినందుకు విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నిజంగా మీరు షాకవుతారు. ఎందుకంటే ఈ సినిమాకు సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
ఇటీవలే స్క్రీన్ స్టూడియోస్ అధినేత లలిత్ కుమార్ మాట్లాడుతూ.. విజయ్ సేతుపతి నటించిన నాలుగు చిత్రాలను తాను నిర్మించానని.. 96లో నటించినందుకు విజయ్ అసలు పారితోషికం తీసుకోలేదని అన్నారు. అందుకే ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందని.. ఆ తర్వాత మా ఇద్దరి కాంబోలో తుగ్లక్ దర్బార్ మూవీ వచ్చిందని అన్నారు.
View this post on Instagram
తుగ్లక్ దర్బార్ షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విజయ్ సేతుపతిని తన సినిమాలో విలన్ పాత్ర చేయాలని కోరాడని.. దీంతో ఆయన మాస్టర్ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించారని అన్నారు. మాస్టర్ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా విలన్ గానే ప్రేక్షకులను చేరువవుతాడని అనుకున్నాము.. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం క్రూరమైన విలన్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చూపించాడు. విజయ్ సేతుపతి కెరీర్‌ని ప్రీ మాస్టర్ మరియు పోస్ట్ మాస్టర్ అని చెప్పుకొవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే షారుఖ్ నటించిన జవాన్ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషించాడు విజయ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.