Tollywood: ఛీ.. ఛీ.. ఇక మీరు మారరా.. థియేటర్లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్..
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోస్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఫ్యా్న్ వార్ ఎక్కువగా ఉంటుంది. కానీ తాజాగా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఏకంగా థియేటర్లోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.

సినీరంగంలో అభిమానుల మధ్య యుద్ధం జరుగుతుంది. తెలుగు. తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందిన స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వైరం ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే కోలీవుడ్ స్టార్స్ అజిత్, విజయ్ దళపతి అభిమానుల మధ్య గొడవలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. గతంలో వీరి ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదమే తలెత్తింది. దీంతో అజిత్ తన అభిమానులతో సమావేశాలు, ఫ్యాన్స్ మీట్ సైతం రద్దు చేసుకున్నారు. అలాగే సినిమా ప్రమోషన్లకు సైతం అజిత్ దూరంగా ఉంటారు. అయినప్పటికీ ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరోసారి ఈ ఇద్దరి ఫ్యాన్స్ కొట్టుకున్నారు. అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ప్రదర్శన సందర్భంగా దళపతి విజయ్ , అజిత్ కుమార్ అభిమానులు ఘర్షణ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
అజిత్ కుమార్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదలైంది. ఈ సినిమా కేరళలోని పాలక్కాడ్‌లోని ‘సత్య’ సినిమా హాలులో ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ థియేటర్ లో విజయ్ దళపతి, అజిత్ కుమార్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఆ తర్వాత ఇరువురి ఫ్యాన్స్ కొట్టుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. ఫ్యాన్స్ గొడవలో థియేటర్ సీట్లు దెబ్బతిన్నాయి. స్క్రీన్ ఉన్న ప్రాంతానికి కూడా నష్టం జరిగినట్లు సమాచారం.
ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అజిత్ కుమార్ అభిమానులతో నిండిన థియేటర్‌కి విజయ్ అభిమానులు వచ్చి సందడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ స్టార్ నటుల అభిమానుల మధ్య ద్వేషం చాలా పాతది. ఇలా చేయవద్దని అజిత్ కుమార్ ఇప్పటికే హెచ్చరించాడు.. అయినా ఫ్యాన్స్ మధ్య వార్ ఆగడం లేదు అంటూ మరో నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు.
I don't know why these illiterate Vijay Fans are coming to Show off in a crowd packed with hardcore Ajith Fans.
Again balamana Adi from Thala Fans to a gang of vijay Fans those came to ruin the #GoodBadUgly celebration inside Theatre .
Exclusive video from Sathya Theatre… pic.twitter.com/4DtXe86X9t
— Unaɪse Reborn (@unnuviews) April 11, 2025
ఇవి కూడా చదవండి :