AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara : సైఫ్ విషయంలో టెన్షన్‌ పడుతోన్న తారక్‌ ఫ్యాన్స్‌.. ‘ఆదిపురుష్‌’ లాగే ‘దేవర’ నూ..

సైఫ్ అలీఖాన్‌కు బాలీవుడ్‌లో డిమాండ్ ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ అడుగుపెట్టారు. ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమాతో మరోసారి తన నటనా ప్రతిభను చాటుకున్నాడు.ఈ సినిమాలో రావణుడి పాత్ర విమర్శలకు గురైనప్పటికీ, సైఫ్‌ నటనను చాలా మంది మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. జాన్వీ కపూర్‌ కథానాయిక. కొరటాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే మరోవైపు సైఫ్‌ విషయంలో ఎన్టీఆర్‌ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

Devara : సైఫ్ విషయంలో టెన్షన్‌ పడుతోన్న తారక్‌ ఫ్యాన్స్‌.. 'ఆదిపురుష్‌' లాగే 'దేవర' నూ..
Devara Movie
Basha Shek
|

Updated on: Aug 13, 2023 | 6:55 AM

Share

సైఫ్ అలీఖాన్‌కు బాలీవుడ్‌లో డిమాండ్ ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ అడుగుపెట్టారు. ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమాతో మరోసారి తన నటనా ప్రతిభను చాటుకున్నాడు.ఈ సినిమాలో రావణుడి పాత్ర విమర్శలకు గురైనప్పటికీ, సైఫ్‌ నటనను చాలా మంది మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. జాన్వీ కపూర్‌ కథానాయిక. కొరటాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే మరోవైపు సైఫ్‌ విషయంలో ఎన్టీఆర్‌ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ బలంగా ఉంది. స్టార్ హీరోలు తమ సినిమాల పాన్ ఇండియా విడుదలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లో ఎక్కువ సందడి చేసేలా హిందీ హీరోలు/హీరోయిన్లను తీసుకొస్తున్నారు. ‘ఆదిపురుష్‌’ నిర్మాతలు కూడా అలాగే అనుకున్నారు. సైఫ్ అలీఖాన్‌ని సినిమాకు జోడించి హిందీ పార్ట్‌లో సినిమాకు మైలేజ్ రాబట్టే ఆలోచనలో ఉన్నారు. కానీ, లెక్క తారుమారైంది.’ఆదిపురుష్‌’ ప్రమోషన్స్‌లో సైఫ్ అలీఖాన్ పాల్గొనలేదు. పైగా ఈ సినిమా విడుదల సమయంలో భార్యతో కలిసి విదేశాలకు వెళ్లాడు. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు భారీగా నష్టపోయారు. అయితే సైఫ్ ఇవేమీ పట్టించుకోలేదు.

ఇప్పుడు ‘దేవర’ సినిమాకు కూడా ఇలాగే ఎలా చేస్తాడనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు తెగ టెన్షన్‌ పడుతున్నారు. ‘దేవర’ చిత్ర బృందం టైటిల్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి సైఫ్‌ రాలేదు. సర్ ప్రైజ్ ఇవ్వడానికే టీమ్ ఇలా చేసిందని అంతా అనుకున్నారు. సినిమా విడుదల సమయంలో అయినా ప్రమోషన్‌లో పాల్గొంటారా అనే ప్రశ్న మొదలైంది. దక్షిణాదిలో తీసిన పాన్ ఇండియన్ సినిమాలకు ఉత్తరాదిలో ప్రచారం పొందడానికి బాలీవుడ్ ఆర్టిస్టులు అప్పియరెన్స్‌ ఎంతగానో సహాయపడుతుంది. ఉదాహరణకు ‘కేజీఎఫ్ 2’లో సంజయ్ దత్ పాత్ర చాలా హెల్ప్ అయింది. అదేవిధంగా ‘దేవర’ సినిమా ప్రమోషన్‌కు సైఫ్‌ సహకారం అందిస్తే చాలా సంతోషిస్తామంటున్నారు ఫ్యాన్స్‌. మరి సైఫ్‌ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో?

ఇవి కూడా చదవండి

సైఫ్ లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు