Pooja Hegde Birthday : బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షులమనసులో స్థానం సంపాదించుకున్న పూజా పుట్టినరోజు నేడు..

పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ( అక్టోబర్ 13) ఈ అమ్మడు పుట్టిన రోజు.

Pooja Hegde Birthday : బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షులమనసులో స్థానం సంపాదించుకున్న పూజా పుట్టినరోజు నేడు..
Pooja
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Oct 13, 2021 | 8:32 AM

Pooja Hegde Birthday : పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ( అక్టోబర్ 13) ఈ అమ్మడు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు, శ్రేయోభిలాషులు పూజాకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు పూజా హెగ్డే. స్టార్ హీరోలందరితో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో జోడి కడుతూ దూసుకుపోతున్నారు పూజా హెగ్డే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాతో పాటు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు పూజా హెగ్డే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయానికొస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో విభ అనే పాత్రలో నటిస్తున్నారు పూజా. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయనటువంటి ఒక హుషారైన పాత్రలో నటించారు పూజా హెగ్డే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్తుంది ఈ బ్యూటీ.  ఖచ్చితంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలైన తర్వాత విభ పాత్ర అందరికీ గుర్తుండిపోతుందని అంటుంది పూజ. ఇక ఈ ముద్దుగుమ్మ  ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు. ఈ మేరకు సోషల్ మీడియాలో పూజా ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. Poojahegde

మరిన్ని ఇక్కడ చదవండి : 

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో