Prabhakar: ‘బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది’… ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఫలితాల అనంతరం పరిస్థితి మరింత ముదిరింది. ముఖ్యంగా మోహన్ బాబు వైఖరిపై, ఆయన ఆధిపత్య ధోరణిపై....

Prabhakar: 'బెనర్జీ అన్న కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయింది'... ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
Etv Prabhakar


మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఫలితాల అనంతరం పరిస్థితి మరింత ముదిరింది. ముఖ్యంగా మోహన్ బాబు వైఖరిపై, ఆయన ఆధిపత్య ధోరణిపై ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ మనసులోని ఆవేదనను వ్యక్తపరిచారు.  ముఖ్యంగా సినీ, టీవీ నటుడు ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ప్రకాష్ రాజ్ ఎప్పుడో గెలిచారని చెప్పారు. ఎలక్షన్ రోజున బెనర్జీ  కళ్ళలో నీళ్లు చూసినపుడు రక్తం మరిగిపోయిందన్నారు. కానీ అవతల ఉంది తండ్రి లాంటి వ్యక్తి అని.. ఇండస్ట్రీలో ఎదురు మాట్లాడితే తొక్కేస్తారు.. 20 ఏళ్లు వెనక్కి వెళ్తామని ఆగిపోయినట్లు వెల్లడించారు. తాను స్వయంగా అలాంటి అనుభవాలను ఫేస్ చేశానని.. కొండను ఢీ కొట్టడం అంత ఈజీ కాదన్నారు. బెనర్జీని అన్న మాటలు.. తనను అని ఉంటే ఊరుకునే వాడ్ని కాదన్నారు.  సగం లెక్కింపు చేసి రిజల్ట్ ప్రకటించారని.. ప్రపంచంలో జరిగిన ఏ ఎలక్షన్ చరిత్రలో కూడా ఇది చూడలేదన్నారు. ఏం చేయలేక.. చేతకానితనంతో వదిలేశామని చెప్పారు. విష్ణు వేలు చూపిస్తూ తనపై అరిచాడని.. ఏ గొడవలు వద్దనే అతని గెలుపుపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. ఎలక్షన్ రోజు మాత్రం మంచు మనోజ్ లేకపోతే పెద్ద గొడవే జరిగేదన్నారు. మోహన్ బాబు మాట్లాడే బూతులు తన జీవితంలో వినలేదన్నారు. తనకైతే ఈ ఎలక్షన్‌లో విష్ణు గారు పోటీ చేస్తున్నట్లు అనిపించలేదని.. మోహన్ బాబు పోటీ చేస్తున్నట్లు అనిపించిందని ప్రభాకర్ చెప్పారు. విష్ణు  మీరు బాగా చేయగలరు అని నమ్ముతున్నా. మీ వల్ల కాకపోతే చెప్పండి మేము వచ్చి చేస్తాం అంటూ సంచలన కామెంట్స్ చేశారు ప్రభాకర్.

Also Read: మంచు విష్ణు నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి..? అతడి మందున్న ఆప్షన్లు ఇవే

 ‘మోహన్ బాబు అమ్మను తిడితే తట్టుకోలేకపోయా’.. తనీష్ ఎమోషనల్ కామెంట్స్

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu